డ్రగ్స్ కేసు : KWAN లో వాటా ఉన్న టాలీవుడ్ హీరోని కూడా విచారిస్తారా...?

Update: 2020-09-23 10:50 GMT
డ్రగ్స్ కేసు : KWAN లో వాటా ఉన్న టాలీవుడ్ హీరోని కూడా విచారిస్తారా...?
  • whatsapp icon
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్ వ్యవహారంలో రోజుకొక సంచలన విషయం బయటపడుతోంది. డ్రగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ కాబడిన హీరోయిన్ రియా చక్రవర్తి.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ నటీనటుల పేర్లు చెప్పినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్వాన్ (KWAN) అనే ప్రముఖ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ కూడా డ్రగ్ వ్యవహారంలోకి వచ్చింది. సుశాంత్ కేసుకు లింక్స్ ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఎన్సీబీ అధికారులు క్వాన్ సీఈఓను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా క్వాన్ తరపున వివిధ నటీనటుల కోసం పనిచేస్తున్న మేనేజర్స్ ని కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారించనున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో KWAN లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు వాటా ఉందనే వార్తలు వచ్చాయి. అయితే వీటిపై సల్మాన్ తరపున న్యాయవాది ఆనంద్ దేశాయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ క్వాన్ లో తన క్లయింట్ కు ఎలాంటి వాటా లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోని కూడా డ్రగ్ కేసు విచారణలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పిలిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సౌత్ నుంచి ఓ తెలుగు హీరో క్వాన్ లో వాటాదారుడుగా ఉన్నాడట. ఇప్పుడు ఆ ఏజెన్సీ డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకోవడంతో సదరు హీరో కూడా వర్రీ అవుతున్నాడట. అతను క్వాన్ ఏజెన్సీ కార్యకలాపాలలో పెద్దగా ఇన్వాల్వ్ కానప్పటికీ.. క్వాన్ తో లింకులున్న వారందరినీ ఎంక్వరీ చేసే క్రమంలో అతన్ని కూడా ఎన్సీబీ అధికారులు పిలిచే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News