హీరోయిన్‌ పెళ్లి స్ట్రీమింగ్‌ రైట్స్ కోసం ఆ రెండు ఓటీటీలు పోటీ!

Update: 2022-11-18 05:29 GMT
సౌత్‌ లేడీ సూపర్ స్టార్‌ నయనతార మరియు విఘ్నేష్ శివన్‌ ల యొక్క వివాహం యొక్క వీడియోను ఒక డాక్యుమెంటరీ తరహా లో నెట్‌ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్‌ చేసిన విషయం తెల్సిందే. నయనతార అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఆ వీడియో ను చూడటంతో ఇక నుండి పెద్ద ఎత్తున సెలబ్రెటీల యొక్క పెళ్లి వీడియోలను స్ట్రీమింగ్‌ చేసేందుకు గాను ఓటీటీ వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

త్వరలో సౌత్‌ మరో స్టార్‌ హీరోయిన్ హన్సిక వివాహం సోహెల్ ఖతురియా తో జరగబోతున్న విషయం తెల్సిందే. తన వ్యాపార భాగస్వామి మరియు మిత్రుడు అయిన సోహెల్ ఖతురియా తో పెళ్లికి హన్సిక రెడీ అయ్యింది అంటూ ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చింది. వీరి యొక్క వివాహంకు జైపూర్‌ లోని ఒక ప్యాలెస్ రెడీ అవుతుంది.

ఇప్పటికే కుటుంబ సభ్యులు కొందరు అక్కడకు చేరుకుని ఏర్పాట్లలో మునిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఈ యొక్క పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ లు రెండు స్ట్రీమింగ్‌ చేసేందుకు రైట్స్ ను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హన్సిక మరియు సోహెల్ ఖతురియా లు ప్రస్తుతం ఆ రెండు ఓటీటీ లతో చర్చలు జరుపుతున్నారు.

రెండు ఓటీటీ లు కూడా అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ఉన్న ఓటీటీ లు అవ్వడం వల్ల ఎక్కువ మందికి తమ పెళ్లి రీచ్‌ అవ్వడంతో పాటు ఎక్కువ డబ్బు వస్తుందని హన్సిక మరియు సోహెల్ ఖతురియా లు భావిస్తున్నారట. ఒకటి రెండు రోజుల్లో ఏ ఓటీటీ సంస్థకు తమ పెళ్లి స్ట్రీమింగ్‌ రైట్స్ ఇవ్వాలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

హన్సిక దేశముదురు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆ సినిమా లో హన్సిక చాలా చిన్న వయసు లోనే నటించింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఇంకా నటిస్తూనే ఉంది. పెళ్లి తర్వాత కూడా ఈమె నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News