ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ స్టార్ మాస్ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ది వారియర్'. ఈ సినిమాలో రామ్ లుక్ మరియు అప్పియరెన్స్ బ్యాక్ గ్రౌండ్ అన్ని కూడా సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమా ప్రారంభం అయ్యి చాలా నెలలు అవుతున్నా విడుదల తేదీ ప్రకటించడం లేదంటూ అంతా భావిస్తున్న సమయంలో ఆ సమయం రానే వచ్చింది.
చిత్ర యూనిట్ సభ్యులు నిన్న ది వారియర్ గురించి రేపు అంటే నేడు ఒక కీలక అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా సర్ ప్రైజ్ ను ప్లాన్ చేశారు. నిన్నటి నుండి రామ్ అభిమానులతో పాటు చాలా మంది ఏంటీ ఆ సర్ ప్రైజ్ అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు. అన్నట్లుగానే అన్న టైమ్ కు ఆ సర్ ప్రైజ్ ను ది వారియర్ టీమ్ రివీల్ చేసింది. ది వారియర్ మూవీ విడుదల తేదీ విషయంలో యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ఈ సమ్మర్ మొత్తం పెద్ద చిన్న సినిమాలతో ఫుల్ ప్యాక్ గా ఉంది. అందుకే ఉస్తాద్ 'ది వారియర్' ను జులై 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తెలుగు తో పాటు తమిళంలో కూడా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు మరియు మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.
రవితేజ నటిస్తున్న రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా ను కూడా జులై నెలలోనే విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. జులై 17వ తారీకున రామారావుగా రవితేజ రావడం కన్ఫర్మ్ అయ్యింది. అంటే ది వారియర్ కి రామారావ్ డ్యూటీకి కేవలం మూడు రోజులు మాత్రమే తేడా. రెండు మంచి బజ్ ఉన్న సినిమాలే అవ్వడం వల్ల ఖచ్చితంగా రెండు సినిమాల మద్య ఫైట్ ఠఫ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇష్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ చేసిన ఒక సినిమా నిరాశ పర్చింది. దాంతో మళ్లీ ఇష్మార్ట్ శంకర్ సినిమా తరహాలో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో చాలా కథలు విని చివరకు తమిళ దర్శకుడు లింగు స్వామికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. పందెం కోడి వంటి సినిమాలను తెరకెక్కించి తమిళంలో మాస్ చిత్రాల దర్శకుడిగా లింగు స్వామికి మంచి పేరు వచ్చింది. అయితే ఆయన ఈమద్య కాలంలో సరైన సక్సెస్ లను అందుకోవడం లో విఫలం అయ్యాడు.
మళ్లీ ఈ సినిమా తో అక్కడ ఇక్కడ తన సత్తాను చాటేందుకు లింగు స్వామి ది వారియర్ సినిమా ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. రామ్ కు కూడా ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం వల్ల బజ్ భారీగా క్రియేట్ అవుతుంది. మరి ఆ స్థాయిలో ఈ సినిమా ఉంటుందా అనేది జులై 14న విడుదల అయితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.