`ది వీల్ ఆఫ్ టైమ్` ట్రైలర్: కొత్త ఫాంట‌సీ ప్ర‌పంచంలోకి ప్ర‌యాణం!

Update: 2021-09-04 13:55 GMT
తెలుగు ఆడియెన్ కి ఇంత‌కాలం వినోదం అంటే టీవీ సీరియ‌ళ్లు లేదా టీవీ షోలు మాత్ర‌మే. సినిమాల ఆడియో ఫంక్ష‌న్లు.. అవార్డు వేడుక‌ల‌కు గొప్ప టీఆర్పీ సాధ్య‌మ‌య్యేది. పండ‌గ‌లు ప‌బ్బాల వేళ టీవీ ప‌రిశ్ర‌మ క్రియేటివిటీ ప్ర‌జ‌ల‌ను కొంత‌మేర‌కు మెప్పించేది. కానీ ఇప్పుడు బుల్లితెర‌కు ఓటీటీ ఆల్ట‌ర్నేట్ గా మారుతోంది. టీవీ సీరియ‌ళ్లు న‌చ్చ‌ని వాళ్ల‌కు ప్ర‌త్యేకించి ఓటీటీ సిరీస్ లో గొప్ప వినోద సాధ‌నంగా మారాయి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తొలి నుంచి అనువాద సిరీస్ లు గొప్ప ఆక‌ర్ష‌ణ‌ను క‌లిగి ఉన్నాయి. అయితే నెట్ ఫ్లిక్స్ తో పోటీప‌డుతూ భారీ విజువ‌ల్ ఫాంట‌సీ సిరీస్ ల‌ను లేదా చిత్రాల‌ను అందించ‌డంలో కొంత వెన‌క‌బ‌డింద‌నే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్ లో వైకింగ్స్ .. ది క్రౌన్ వంటి ఎపిక్ డ్రామా షోలు పెద్ద విజ‌యం సాధించాయి. ఇటీవల విడుదల చేసిన షాడో అండ్ బోన్ .. ది లాస్ట్ కింగ్‌డమ్ వంటి ఎపిక్ ఫాంటసీ సిరీస్ లు భారీ విజువ‌లైజేష‌న్ తో అద్భుతాల‌ను సృష్టించాయి. ఇప్పుడు అదే బాట‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ప్ర‌యాణిస్తోంది. `ది వీల్ ఆఫ్ టైమ్` ఈ త‌ర‌హానే. తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్ రిలీజై విశేషంగా ఆక‌ర్షిస్తోంది.

ఫాంట‌సీ ఎలిమెంట్స్ తో ఒక విజువ‌ల్ అద్భుతంగా ఈ సిరీస్ ని అమెజాన్ రూపొందించింది. 1990 లో రాసిన రాబర్ట్ జోర్డాన్ `ది వీల్ ఆఫ్ టైమ్` అనే సూపర్ హిట్ పుస్తక శ్రేణి ఆధారంగా ఇప్పుడు అమెజాన్ అదే పేరుతో పెద్ద బడ్జెట్ వెబ్ సిరీస్ ని రూపొందించింది. ఏస్ సెడై అని పిలుచుకునే మహిళా ఇంద్రజాలికులు త‌న బృందం ప్రకృతిని నియంత్రిస్తుంది. వ్య‌తిరేక శ‌క్తుల్ని నియంత్రిస్తూ ప్రపంచాన్ని రక్షించడం కోసం ఏదైనా చేయడానికి వారి శక్తులను ఉపయోగిస్తుంది.
ట్రైల‌ర్ ఆద్యంతం అలాంటి విన్యాసాలు ఆక‌ట్టుకున్నాయి. జోర్డాన్ ప్రపంచంలోని కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలను స్థాపించి మొయిరైన్ దామోడ్రేడ్ (రోసాముండ్ పైక్) పై ప్రత్యేక దృష్టి పెట్టి ఈస్ సెడాయ్ అని పిలువబడే మహిళా మేజిక్ విల్డర్ల సమూహంలో సభ్యురాలు .. ప్ర‌కృతి నియంత్ర‌ణ‌తో సూప‌ర్ పవర్స్ ని ఉపయోగిస్తూ సాగించే విన్యాసాలు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఈ సిరీస్ ప‌ద్నాలుగు పుస్తకాల శ్రేణితో విడుద‌ల కాగా గొప్ప రీడ‌బులిటీతో ఆద‌ర‌ణ పొందాయి. మొద‌టి భాగం విజ‌య‌వంతం అయితే అమెజాన్ మరో మ‌రిన్ని సీజన్లను సులభంగా తీసుకువచ్చే అవకాశం ఉంది. ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంత విజువ‌ల్ క్రియేటివిటీ ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఇందులో క‌నిపించ‌నున్నాయి. ప్రైమ్ వీడియో ఈ సిరీస్ తెలుగు- తమిళం- హిందీలో అలాగే భారతదేశంలో ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్ తో సిరీస్ ని అందుబాటులోకి తేనుంది. అలాగే ఆర్.ఆర్ టోల్కీన్ రాసిన ఒరిజినల్ పుస్తకాల ఆధారంగా ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే మరో సిరీస్ ను కూడా అమెజాన్ ప్రైమ్ తెర‌పైకి తీసుకురానుంది. ఇక తెలుగు ఆడియెన్ కి అమెజాన్ ప్రైమ్ లో విజువ‌ల్ అద్భుతాలు అందుబాటులోకి రానున్నాయ‌న‌డంలో సందేహ‌మేం లేదు.


Full View
Tags:    

Similar News