తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కీలక సమావేశం ఒకటి గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్ లో జరిగినట్లుగా సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తి వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ నిర్ణయం తీసుకున్న కాసేపటికే.. ఏఎంబీ మాల్ లో చిత్రపరిశ్రమకు చెందిన ముఖ్యులతో ఒక సమావేశం జరిగినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా థియేటర్లు తెరుచుకోవటానికి ఓకే చెప్పినా.. ప్రాక్టికల్ గా ఉన్న సమస్యలు.. థియేటర్ల ఎప్పుడు ఓపెన్ చేయాలన్న అంశంపై సినీ పెద్దలు పలువురు సమావేశమైనట్లు చెబుతున్నారు.
మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్.. హైదరాబాద్ మహానగరంలోని లగ్జరీ మల్టీఫ్లెక్సుల్లో ముఖ్యమైనది.దాని కేంద్రంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన కీలకమైన వ్యక్తుల మధ్య జరిగిన ఈ మీటింగ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. చిత్రపరిశ్రమకు చెందిన పలువురికి ఇన్విటేషన్ అందలేదని చెబుతున్నారు. చిత్రపరిశ్రమను శాసిస్తున్న కొద్దిమంది.. అత్యధిక థియేటర్లు ఉన్న కొందరితో పాటు.. ముఖ్యమైన సింగిల్ థియేటర్ ఓనర్లు కొందరు ఈ మీటింగ్ కు హాజరైనట్లుగా తెలుస్తోంది.
థియేటర్లు తెరవాలని ప్రభుత్వం చెప్పినా.. ఇప్పటికిప్పుడు తెరిచే ఆలోచన లేదని వారు తేల్చినట్లు చెబుతున్నారు. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లకు కొన్ని మినహాయింపులు ఇవ్వటం తెలిసిందే. ఆ హామీల్ని ఇప్పటివరకు అమలు చేయలేదు. అందుకే వాటిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా చేయటం.. ఆ తర్వాత సినిమా థియేటర్లను ఓపెన్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు చెబుతున్నారు.
అదే సమయంలో ప్రస్తుతం అమలవుతున్న రెంటల్ విధానానికి బదులుగా గతంలో అమలు చేసిన పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని.. అందుకు నిర్మాతలు ఓకే అంటే తప్పించి థియేటర్లు తెరిచే పరిస్థితి లేదన్న మాట వినిపిస్తోంది. ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలుకీలక అంశాల మీద ఏఎంబీ మాల్ లో సమావేశం జరిగినట్లుగా సమాచారం.