పాడు కరోనా.. మాయదారి మహమ్మారి.. ఎంత దెబ్బేసింది? సినీ పరిశ్రమకు దారుణ అనుభవాన్ని మిగిల్చిందని గుండెలు బాదుకునే వారు చాలామందే కనిపిస్తారు. నిజానికి ఆ మాటలో చాలానే వాస్తవం ఉంది. అగ్ర హీరోలు.. పేరున్న హీరోయిన్లు.. భారీగా రెమ్యునరేషన్ ఛార్జి చేసే దర్శకులకు ఫర్లేదు కానీ.. ఏ పూటకు ఆ పూట.. ఏ సినిమాకు ఆ సినిమా వేషం కోసం వెయిట్ చేసే వారు.. అవకాశాల కోసం అదే పనిగా ప్రయత్నించే వారికి కోలుకోలేని దెబ్బ తీసింది కరోనా. మహమ్మారి సరిపోదన్నట్లుగా ఇప్పుడు వచ్చి పడ్డ ఓటీటీ ఫ్లాట్ ఫాం సినీ పరిశ్రమకు భారీ సవాలుగా చెప్పాలి.
ఎంత వినూత్నంగా సినిమాలు తీసినా.. భారీగా పెరిగిపోయిన ఖర్చు నేపథ్యంలో సగటు ప్రేక్షకుడి జేబుకు బడ్జెట్ ఎక్కువైతే.. చూసే సినిమాలకు కోత పెడతాడు. థియేటర్ కు వెళ్లి సినిమాలు చూడాలన్న ఆలోచనను తగ్గించేస్తాడు. అప్పుడు క్రేజీ సినిమాలు తప్పించి ఇతర సినిమాల్ని చూసేందుకు ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్లాలన్న ఆలోచన చేయరు. ఒకరకంగా చూస్తే.. ఇది కూడా ఇబ్బందే.
గుప్పెడు సినిమాలు చూస్తే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న. ఇలాంటి సందేహం మరింత పెరిగేలా ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వులు ఉన్నాయి. టికెట్ ధరల్ని రద్దీ ఆధారంగా మారేలా అవకాశాన్ని కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో.. రద్దీ వేళల్లో ఎక్కువ ధరకు.. రద్దీ తక్కువగా ఉండే వేళలో టికెట్ ధరలు తగ్గుతాయి. సాధారణంగా రద్దీ ఎప్పుడంటే.. శుక్రవారం సాయంత్రం షోతో మొదలై.. ఆదివారం సాయంత్రం షోతో ముగుస్తుంది.
మరీ.. పెద్ద సినిమాలు విడుదలైతే మాత్రం ఆదివారం రాత్రి షోలు ఫుల్ అవుతాయి. జనం ఎక్కువగా వచ్చే ఈ రోజుల్లో టికెట్ ధరల్ని పెంచుకునే సౌలభ్యం ఇస్తే.. వారు భారీగా పెంచేస్తారు. అదే సమయంలో విడి రోజుల్లో మామూలు ధరల్ని ఉంచుతారు. దీంతో.. ఉద్యోగాల కారణంగా విడిరోజుల్లో సినిమా కోసం థియేటర్ కు వెళ్లే అవకాశం ఉండదు. వీకెండ్ లో టికెట్ ధరలు పెరిగి ఉండటం వల్ల సినిమా వైపు చూసే ఛాన్సు ఉండదు.
కాబట్టి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. వాటిని అమలు చేసే విషయంలో నిర్మాతలు కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. లేకుంటే.. మొదటికే మోసం రావటం ఖాయం. ఎందుకంటే..కొవిడ్ కారణంగా సినీ పరిశ్రమ మాత్రమే కాదు.. అన్ని పరిశ్రమలు దెబ్బతిన్నాయి. అన్నింటికి మించి సామాన్యుడు ఆర్థిక సమస్యల సుడి గుండంలో చిక్కుకున్నారన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. అయినా.. థియేటర్లు ఓపెన్ కాక ముందే.. టికెట్ బాంబ్ ఈ రీతిలో పేలితే ఎలా?