ఇప్పటికే కరోనా ధాటికి ఏడాది కోల్పోయి అత్యంత దుర్భర పరిస్థితులను అనుభవించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సినిమా పరిశ్రమనే.. అన్ని రంగాలు అంతో ఇంతో తెరుచుకున్నా అన్నింటికంటే చివరన ఓపెన్ అయ్యింది సినిమా ఇండస్ట్రీ. సమూహాలు ప్రజలు గుమిగూడే థియేటర్లకు ఇటీవలే 100శాతం అక్యూపెన్సీతో చూసేలా ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ పై మరో పిడుగు పడేలా కనిపిస్తోంది.
కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా తెలంగాణలో సినిమా థియేటర్లు మళ్లీ మూతపడే దిశగా పరిస్థితులు కనిపిస్తున్నాయట.. ఈ మేరకు విద్యాసంస్థలను బంద్ చేయించిన తెలంగాణ సర్కార్ తాజాగా వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనల మేరకు థియేటర్ల విషయంలోనూ కీలక నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే టాలీవుడ్ పై పిడుగు పడినట్లే..
పవన్ కళ్యాణ్ హీరో వకీల్ సాబ్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడితే సినిమా ఇండస్ట్రీ కోలుకోవడం కష్టమే. ఏడాదిగా ఆగిన పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ సర్కార్ ఒకవేళ థియేటర్లు బంద్ చేసినా.. 50శాతం అక్యూపెన్సీ పెట్టినా అవి తీవ్రంగా నష్టపోవడం ఖాయం.
తెలంగాణ రాష్ట్రవైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని.. ఈ మేరకు కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా సినిమా థియేటర్లు మూసివేయాలని సూచించిందని సమాచారం. మూసివేయకపోతే 50శాతం అక్యూపెన్సీతో నడిపించాలని కీలక ప్రతిపాదనలను ఆశాఖ తెలంగాణ సర్కార్ కు చేసినట్టు ప్రచారం సాగుతోంది. కరోనా వేవ్ చేయిదాటకుండా చేయాలంటే విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, జిమ్ లు, ప్రజలు గుమిగూడే సముదాయాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం.
ఇప్పటికే విద్యాసంస్థలను మూసివేయాలని పదిరోజుల క్రితమే వైద్యఆరోగ్యశాఖ ప్రతిపాదించగా తెలంగాణ సర్కార్ నిన్న నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సినిమా తియేటర్ల విషయంలో వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇదే జరిగితే టాలీవుడ్ మరింత నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.