నాలుగు సినిమాల పోటీలో థియేట‌ర్లు పెంచారు..

Update: 2021-01-17 08:59 GMT

మాస్ మహారాజ్ రవితేజ  న‌టించిన‌ మాస్ మసాలా ఎంటర్ టైనర్  క్రాక్ సంక్రాంతి కానుక‌గా మ‌రో మూడు సినిమాల‌తో పోటీప‌డుతూ రిలీజైంది. ఈ సినిమా తొలి వీకెండ్ నాటికి చెప్పుకోద‌గ్గ వ‌సూళ్ల‌ను సాధించి టీమ్ కి సంతృప్తిక‌ర ఫ‌లితాన్ని అందించింది. ఈ మూవీలో మాస్ మ‌హారాజా ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్.. శ్రుతిహాస‌న్ గ్లామ‌ర్ రొమాంటిక్ సాంగ్స్ అన్నీ మాస్ కి బాగా క‌నెక్ట‌య్యాయి.

50 శాతం సీటింగ్ తోనే బ్రేక్ ఈవెన్ సాధ్య‌మా? అని భావిస్తే నెమ్మ‌దిగా ఆ దిశ‌గా వసూళ్ల‌ను పిక్ చేసుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. ఇప్ప‌టికీ ఆడియెన్ లో రెస్పాన్స్ బావుంది. థియేట‌ర్లు ఫుల్స్ అవుతున్నాయ‌న్న స‌మాచారం ఉంది.

మాస్ క్లాస్ అనే తేడా లేకుండా జ‌నం క‌రోనా భ‌యాల్ని వ‌దిలి థియేట‌ర్ల‌కు వ‌స్తుండ‌డంతో ఇప్పుడు క్రాక్ కి థియేట‌ర్ల సంఖ్య పెంచుతున్నార‌ని తెలిసింది. ఏపీ-తెలంగాణ‌లో థియేట‌ర్ల పెంపున‌కు క్రాక్ టీమ్ సిద్ధ‌మ‌వుతోంది. ఇంత‌టి క్రైసిస్ లోనూ పోటీ సినిమాలు మిశ్ర‌మ స్పంద‌న‌ల‌తో ఫ‌ర్వాలేద‌నిపించే క‌లెక్ష‌న్స్ తెస్తుండ‌డం కూడా ఆస‌క్తిక‌ర ప‌రిణామం.
Tags:    

Similar News