కరోనా మొదటి వేవ్ ఏడెనిమిది నెలల పాటు ఇండస్ట్రీని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా రిలీఫ్ ఇవ్వగానే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. డిసెంబర్ - జనవరి- ఫిబ్రవరి సీజన్ లో వరుసగా సినిమాలు రిలీజవ్వడం జనాలు ఆదరించడంతో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు సెకండ్ వేవ్ అనంతరం తిరిగి అలాంటి పరిస్థితి రిపీటవుతుందా? మొదటి వేవ్ గత వానాకాలం లో రిలీఫ్ ఇచ్చినట్టే సెకండ్ వేవ్ కూడా ఈ వర్షాల సీజన్ లో రిలీఫ్ నిస్తుందా? అంటూ చర్చ సాగుతోంది.
అయితే ఒక సెక్షన్ విశ్లేషణ మాత్రం మునపటి మాదిరిగా థియేటర్లు తెరుచుకుని ఫుల్ రన్ కి రావాలంటే దసరాకి కూడా సాధ్యం కాదు. ఈ ఏడాది దీపావళి వరుకు ఆగాల్సిందేనని చెబుతున్నారు. అంత సమయం వేచి చూసేకంటే కష్టాల్లో ఉన్న నిర్మాతలు ఆగకుండా ఓటీటీలకు సినిమాల్ని ఇవ్వడమే సబబు అని విశ్లేషిస్తున్నారు.
దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో క్రేజీ సినిమాలు కొన్ని ఓటిటి బాట పట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. దాదాపు డజను క్రేజీ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూస్తున్నాయి. కానీ వీటిలో వేటిని ఓటీటీలకు విక్రయిస్తారు? అన్నది వేచి చూడాల్సిందే. ఓటీటీలో గిట్టుబాటయ్యే డీల్ దొరకడం కష్టంగా మారిన తరుణంలో వేచి చూస్తారా? అన్నదానిపైనా ఒక సెక్షన్ సందేహం వ్యక్తం చేస్తోంది.