అనుకున్నంతా అవుతోంది. సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు రావడం కొత్తేమి కాదు కాని అన్ని క్రేజ్ ఉన్నవే అయినప్పుడు అసలు సమస్య మొదలువుతుంది. పోయిన ఏడాది చిరు - బాలయ్య - శర్వానంద్ సినిమాలు బరిలో దిగితే తాను కూడా వచ్చి తీరాలి అని పట్టుబట్టిన ఆర్ నారాయణ మూర్తి థియేటర్ల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. ఒక ప్రముఖ దినపత్రికకు చెందిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ సహకరించే దాక ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. సినిమాలు బాగున్నాయా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెనింగ్స్ చాలా కీలకమైనవి. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసుకుని రెవిన్యూ ఎంత రాబట్టుకున్నాం అనే దాని మీద తప్ప 50 - 100 రోజులు సినిమా ఆడించే రోజులు ఏనాడో పోయాయి. అందుకే స్క్రీన్ కౌంట్ చాలా కీలకంగా మారింది. ఈ సంక్రాంతికి లాస్ట్ ఇయర్ కంటే రంజైన పోటీ ఎదురు పడనుంది.
అజ్ఞాతవాసికి మొదటి రెండు రోజులు ఏ ప్రాబ్లం లేదు. తొంబై శాతం పైగా థియేటర్స్ లో పవన్ తప్ప ఇంకెవరు ఉండరు. 12న జైసింహ - గ్యాంగ్ రెండు ఒకేసారి వస్తాయి. బాలయ్య నిర్మాత సి.కళ్యాణ్ నెట్ వర్క్ గురించి తెలిసిందే. పైగా అధికార పార్టీ ఎమెల్యే నటించిన సీనియర్ స్టార్ హీరో సినిమా. ఫాన్స్ బలం ఉంది. ఎంత లేదన్నా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక గ్యాంగ్ వెనుక యువి లాంటి పెద్ద బ్యానర్ - అల్లు అరవింద్ స్నేహ హస్తం ఉంది. యువి సంస్థ ఇప్పటికే చాలా చోట్ల పాత థియేటర్ కాంప్లెక్స్ లు లీజుకు తీసుకుని వి సెల్యులాయిడ్ పేరుతో నిర్వహిస్తున్నారు.
అజ్ఞాతవాసి టాక్ ఎంత బాగా వచ్చినా గ్యాంగ్ మాత్రం వీటిలో మేజర్ స్క్రీన్స్ లో పడిపోతుంది. ఇక రంగుల రాట్నం బజ్ తక్కువగా ఉన్నా తీసింది నాగార్జున కాబట్టి తనకూ వీలైనన్ని రాబట్టుకునే ప్లానింగ్ లో ఉంటారు. వీటిలో అప్ అండ్ డౌన్స్ జరగడం ఖాయం. అజ్ఞాతవాసి కంప్లీట్ స్టేటస్ 12 లోపు తెలిసిపోతుంది కాబట్టి మిగిలిన మూడు సినిమాల స్క్రీన్ కౌంట్లో మార్పు దాని మీద కూడా ఆధారపడి ఉంది. ఏది ఏమైనా సినిమా ప్రేమికులు మాత్రం నాలుగు సినిమాలు చూసేందుకు ఎంతవుతుందా అని బడ్జెట్ లెక్కల్లో మునిగి తేలుతున్నారు.