సినిమా థియేటర్లపై బాంబ్ పేలనుందా? రానున్న కాలంలో థియేటర్లు కనుమరుగు కానున్నాయా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. థియేటర్లు కళ్యాణ మంటపాలు అయ్యాయి అన్న మాట మళ్లీ వినాల్సి వచ్చే సన్నివేశం దాపురించనుందన్న వాదనా తెరపైకొచ్చింది. ఇన్నాళ్లు ఆ నలుగురు థియేటర్ల కబ్జా అంటూ పలువురు మీడియా వేదికలపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. థియేటర్ల కబ్జా అంటూ దర్శకరత్న దాసరి అంతటి వారే ఆరోపించారు. చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం లేదని చిన్న నిర్మాతలు పలు సందర్భాల్లో అరిచి గీపెట్టిన సందర్భం ఉంది. అయితే థియేటర్ల వ్యవస్థలో అసలేం జరుగుతోంది? నిజంగానే సినిమాలకు థియేటర్లు సరిపోవడం లేదా? రిలీజ్ కి వస్తున్న సినిమాల ఉధృతి అంతగా ఉందా? అంటే అందుకు పూర్తి భిన్నమైన వాదన తాజాగా తెరపైకి వచ్చింది.
అసలు ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే.. థియేటర్లకు వచ్చే వాళ్లే కరువయ్యారు. ఏదో హిట్టయిన ఒకట్రెండు సినిమాలకు తప్ప మిగతా సినిమాల్ని థియేటర్లకు వచ్చి చూసే సన్నివేశమే లేకపోవడంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. కనీస మెయింటెనెన్స్ కి కూడా అవకాశం లేకుండా పోతోందన్న వాదనా వినిపిస్తోంది. అంతేకాదు సీడెడ్ లో మెజారిటీ పార్ట్ థియేటర్లను నిర్వహిస్తున్న డి.సురేష్ బాబు- ఎన్.వి.ప్రసాద్ బృందం రానురాను థియేటర్లను తగ్గించుకుంటున్నారని, కేవలం గిట్టుబాటు అయ్యే థియేటర్లను మాత్రమే రన్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇదొక్కటే కాదు.. పులిమీద పుట్రలా ఇటు నైజాంలోనూ థియేటర్ల ఆదాయ సమస్య ఉధృతి పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. మార్చిలో అసలు ఫీడింగ్ ఉండే పరిస్థితే లేదని - ఆ క్రమంలోనే మెయింటెనెన్స్ కు ఇబ్బంది పడే పరిస్థితి రానుందని థియేటర్ యజమానులు వాపోతున్నారట. సంక్రాంతి - దసరా వంటి పండగల వేళ తప్ప ఇతర సమయాల్లో థియేటర్లకు జనం రావడం లేదన్న వాదనా వినిపిస్తోంది.
ఈ మార్చి నుంచి ఏడెనిమిది నెలల పాటు సరిగా థియేటర్లకు సరిపడా సినిమాలు లేవన్న మాటా వినిపిస్తోంది. పైగా నైజాంలో మల్టీప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజును ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ నిర్ణయంపై థియేటర్ యాజమాన్యాలు గుర్రు మీద ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ఆదాయం పడిపోవడం - థియేటర్లకు జనం రాకపోవడంతో మార్చిలో నైజాం థియేటర్ ఓనర్స్ బంద్ నిర్వహించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ బంద్ ఆంధ్రాలో ఉండదని తెలుస్తోంది.