కరణ్ జోహార్ కి మొదలైపోయినట్లేనా?

Update: 2016-10-14 11:30 GMT
జమ్ము కశ్మీర్ లో ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదదాడి - పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం సర్జికల్ దాడులు అనంతరం భారత్ లో ముఖ్యంగా బాలీవుడ్ లో జరిగిన పరిణామాల సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇకపై పాక్ కళాకారులను బాలీవుడ్ సినిమాల్లోకి తీసుకోరాదని, వారు నటించే సినిమాల షూటింగులను సైతం అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించడం - ఫలితంగా కొంతమంది పాకిస్థాన్ నటులు పరారయిపోయారన్న వార్తలు రావడం తెలిసిందే! ఈ క్రమంలో పాక్ నటీనటులపై భారతీయ నిర్మాతల మండలి నిషేధం విధించింది. ఈ విషయంలో పాక్ నటులను సమర్ధించడంతో కరణ్ జోహార్ ఇరుకున పడ్డారు. దీంతో తాజాగా కరణ్ జోహార్ కు థియేటర్ యజమానులు షాకిచ్చారు.

పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించరాదని థియేటర్ యజమానులు నిర్ణయించారు. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన కరణ్‌ జోహార్ తాజా చిత్రం "ఏ దిల్ హై ముష్కిల్ "లో రణబీర్ కపూర్ - ఐశ్వర్యా రాయ్ - అనుష్క శర్మలతో పాటు పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు. ఈ సినిమాలో ఫవాద్ ఖాన్ కీలక పాత్రలో నటించడం - కరణ జోహార్ వ్యాఖ్యలతో పాక్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ల యజమానులు నిర్ణయించారు. దీంతో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా కష్టాల్లో పడింది. ఈమేరకు గుజరాత్ - గోవా - కర్ణాటక - మహారాష్ట్రలోని థియేటర్ యజమానులు ఈ సినిమాపై నిషేధం విధించారు.

కాగా, మొన్న పాకిస్థాన్ నటులకు అవకాశం ఇవ్వరాదని, ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఎంఎన్ ఎస్ హెచ్చరించగా - తాజాగా పాక్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ యజమానులు నిర్ణయించడంతో కరణ్‌ జోహార్ సహా బాలీవుడ్ నిర్మాతలు కొందరు ఇరకాటంలో పడ్డారు! ఇదే క్రమంలో షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రాయిస్ సినిమాలతో పాటు షారూఖ్ - కరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న "డియర్ జిందగీ" సినిమాల రిలీజ్ ను "సినిమా ఓనర్స్ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా" ఇప్పటికే వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News