థియేట‌ర్లు 3డి క‌న్వ‌ర్ష‌న్ క‌ష్ట‌మా?

Update: 2018-11-18 17:30 GMT
ర‌జ‌నీ `2.ఓ` రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ఫ్యాన్స్‌ లో టెన్ష‌న్ పెరుగుతోంది. అంత‌కుమించి ఈ సినిమాపై ర‌క‌ర‌కాల డిస్క‌ష‌న్ షురూ అయ్యింది. యూత్‌తో పాటు పెద్దాళ్ల‌ల్లోనూ దీనిపై చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఇక‌పై 3డి సినిమాల టైమ్ స్టార్ట‌యిన‌ట్టేనా? అలా అయితే తెలుగు రాష్ట్రాల‌ థియేట‌ర్ల లో టెక్నాల‌జీ మార్చాలా?  మార్చాలంటే పెద్ద రిస్కే క‌దా?  ఇప్ప‌టికే క్యూబ్ - యుఎఫ్‌ వో అంటూ థియేట‌ర్ య‌జ‌మానులు పెనుభారం మోస్తున్నారు. ఖ‌ర్చులు త‌డిసిమోపెడ‌వుతున్నాయి. ఇప్పుడు టెక్నాల‌జీ అప్‌ డేట్ పేరుతో ఇంకెంత బ‌రువు మోయాల్సి ఉంటుందోన‌న్న చ‌ర్చా సాగుతోంది. ఓవైపు 2.ఓ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేట‌ర్ల‌లో 3డి వెర్ష‌న్ రిలీజ్ చేసేందుకు ఎన్వీ ప్ర‌సాద్-దిల్‌రాజు-యువి క్రియేష‌న్స్ వంశీ టీమ్ స‌న్నాహ‌కాల్లో ఉంది. అస‌లు 3డి సెట‌ప్ ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క‌వుట‌వుతుంది మ‌నకు? అని ప్ర‌శ్నించుకుంటే..

ఇదేమీ పెద్ద రిస్క్‌ తో కూడుకున్న‌ది కాద‌న్న మాటా వినిపించింది. హైద‌రాబాద్ - విజ‌య‌వాడ‌ - విశాఖ‌ప‌ట్నం స‌హా మెట్రో న‌గ‌రాల్లో ఇప్పుడున్న మ‌ల్టీప్లెక్సుల‌న్నీ 3డి స్క్రీన్ ఇన్‌ బిల్ట్ చేసిన‌వే. వాటిలో 3డి సినిమాలు ప్ర‌ద‌ర్శించడానికి అద‌న‌పు ఖ‌ర్చేం ఉండ‌దు. స్క్రీన్‌ ని మార్చాల్సిన అవ‌స‌రం లేదు. 3డి థియేట‌ర్ క‌న్వ‌ర్ష‌న్ అన్న‌ది కేవ‌లం సింగిల్ స్క్రీన్ల‌కు మాత్ర‌మే చేయాల్సి ఉంటుంది. వాటిని 3డికి మార్చుకోవాలంటే ప్ర‌త్యేక‌మైన స్క్రీన్ సెట‌ప్ ఉంటుంది.. అద‌నంగా తెర‌పై తెర‌ను అమ‌రుస్తారుట‌. అలాగే ప్రొజెక్ట‌ర్‌ కి ప్ర‌త్యేకించి లెన్స్ ఛేంజ్ చేసి - 3డి లెన్స్ వేయాల్సి ఉంటుంది. మ‌ల్టీప్లెక్సు అయితే స్క్రీన్ల‌కు తెర మార్చాల్సిన ప‌ని లేదు.. కేవ‌లం ప్ర‌జెక్ట‌ర్‌ కి లెన్స్ మారిస్తే స‌రిపోతుంది.

ఇక ఈ మార్పుల‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది? అంటే మ‌ల్టీప్లెక్సుకి ఖ‌ర్చేమీ ఉండ‌దు. సింగిల్ స్క్రీన్ల‌కు అయితే 3డి సెట‌ప్‌ కి రూ.5ల‌క్ష‌ల ఖ‌ర్చ‌వుతుందని తెలుస్తోంది. 2.ఓ స‌క్సెసై 3డికి జ‌నం అడిక్ట్ అయితే మొత్తం మార్పుకి శ్రీ‌కారం చుట్టే అవ‌కాశాలు ఉంటాయి. మునుముందు టాలీవుడ్‌ లో 3డి సినిమాల వైపు మొగ్గు చూపే ఛాన్సుంద‌న్న మాటా వినిపిస్తోంది. సాంకేతిక‌త‌ను ఆస్వాధించాలి. ప్రేక్ష‌కుల‌కు చేరువ చెయ్యాల‌న్న ప్ర‌య‌త్నం జ‌ర‌గాల‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. మార్పు మంచికే.. వినోదం పెంచేందుకేన‌న్న మంచి మాట చెబుతున్నారు. నవంబ‌ర్ 29న 2.ఓ రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News