సంక్రాంతి అంటే సినిమాలకు కూడా పండగ సీజనే. అందుకే ఆ టైంలో వచ్చేందుకు తెగ ఇష్టపడుతుంటారు మూవీ మేకర్స్. సాధారణంగా 2,3 సినిమాలు పోటీ పడుతుంటాయి. అందులో ఒకటో - రెండో మంచి వసూళ్లు రాబట్టుకుంటాయి. కానీ ఈ సారి సంక్రాంతి అందరికీ క్లిష్టంగా మారిపోతోంది.
సంక్రాంతి రిలీజ్ లలో అన్నిటి కంటే ఎక్కువ అంచనాలు, హైప్ ఉన్న మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రానికి బడ్జెట్ కూడా చాలా ఎక్కువ. కానీ సంక్రాంతి రేస్ మాత్రం బాగా టఫ్ అయిపోయింది. జూనియర్ నాన్నకు ప్రేమతో - బాలయ్య డిక్టేటర్ - నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన - శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా - విశాల్ డబ్బింగ్ మూవీ కథకళి.. ఇలా ఐదు సినిమాలు సంక్రాంతినే టార్గెట్ చేశాయి. వీటికి తోడు రామ్ లేటేస్ట్ మూవీ నేను.. శైలజ.. కు హిట్ టాక్ రావడంతో.. అది కూడా చెప్పుకోదగిన థియేటర్స్ లో సందడి చేయడం ఖాయం.
మరి ఇంత టఫ్ కాంపిటీషన్ లో ఎన్టీఆర్ మూవీకి ఎన్ని థియేటర్స్ దొరుకుతాయన్నది క్వశ్చన్. మొత్తం 1400 స్క్రీన్ లలో ఇప్పుడు ఎన్టీఆర్ కి 500దొరికితే ఎక్కువ అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఇది చాలా చిన్న సంఖ్య. మొదటి వారం కలెక్షన్స్ పైనే హిట్ - ఫ్లాప్ డిసైడ్ అయిపోతున్న రోజులివి. భారీ బడ్జెట్ సినిమా సోలో రిలీజ్ అయితే మాత్రమే.. సేఫ్ జోన్ అంటున్నారు. మహా అయితే రెండు సినిమాలను అకామడేట్ చేయచ్చు. కానీ ఇలా అరడజన్ సినిమాలకు స్క్రీన్ లు పంచేస్తే.. ఇక కలెక్షన్స్ బాగా డల్ అయిపోతాయి. పర్మిషన్స్ తెచ్చుకుని రేట్లు పెంచినా, అది కూడా అంత ప్రభావం చూపకపోవచ్చు.
మరి ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీతో 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాలని భావిస్తున్నాడు. ఇది 500 థియేటర్లతో సాధ్యమయ్యే పనేనా అనిపిస్తోంది. ఈ మూవీస్ లో కనీసం రెండు వాయిదా పడితేనే.. అన్ని సినిమాలకు మంచి జరుగుతుంది. ఇందులో తగ్గడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య. రిలీజ్ డేట్ కి మరో 10 రోజులు ఉంది కాబట్టి.. ఈ లోపు ఎవరు తగ్గుతారో.. ఎవరు నెగ్గుతారో చూద్దాం.