శర్వానంద్ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కొత్తదనమున్న కథలను ఎంచుకోవడంలో ఆయన నాని తరువాత స్థానంలో ఉండేవాడు. కానీ 'మహానుభావుడు' సినిమా తరువాత ఆయనకి వరుస ఫ్లాపులు ఎదురవుతూ వస్తున్నాయి. సాధారణంగా ఫ్యామిలీ హీరో అనిపించుకోవడానికి హీరోలకు కొంత కాలం పడుతుంది. కానీ శర్వానంద్ చాలా తక్కువ సమయంలోనే ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. అలాంటి శర్వానంద్ నుంచి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా రాకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన 'ఒకే ఒక జీవితం' సినిమా చేశాడు. ఎస్. ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ప్రెస్ మీట్ లో శర్వా మాట్లాడుతూ ..
ముందుగా మీడియా మీత్రులందరికీ ఒక మాట .. ఈ సినిమా విషయంలో మీరు ఎంతవరకూ హెల్ప్ చేయగలిగితే అది ఈ సినిమాకి అంత హెల్ప్ అవుతుంది. ఇది నేను మనసుతో చెబుతున్న మాట. ఒక గొప్ప సినిమాను చేశారు అనే మాటను మీ నోటి ద్వారా వినాలని మేమంతా కోరుకుంటున్నాము.
ఈ కథ మనసుకు హత్తుకుపోతుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంటుంది. మనకి ఎప్పుడూ కూడా నిన్నటి గురించిన ఒక బాధ ఉంటుంది ... రేపటి గురించిన ఒక ఆశ ఉంటుందిగానీ, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలనే ఆలోచన మాత్రం రాదు.
అది గుర్తించి బ్రతకగలిగితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అందుకే 'ఒకే ఒక జీవితం' అనే టైటిల్ పెట్టడం జరిగింది. బలమైన సెంటిమెంట్ .. ఎమోషన్స్ ఉంటాయని భయపడొద్దు. ఇటు నేను .. అటు వెన్నెల కిశోర్ .. ప్రియదర్శి ట్రాక్ ఎంటర్టైన్ మెంట్ తో నడుస్తుంది.
అమ్మా .. కొడుకు కథ అనగానే ఏదో ఎమోషన్స్ ఉంటాయని అనుకుంటారని నాకు తెలుసు. కానీ ఇందులో కావలసినంత ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది. కార్తి గారు ఈ సినిమా కోసం ఒక పాట పాడారు. ఒక హీరో కోసం మరో హీరో పాడటం, ప్రమోషనల్ వీడియో కోసం డాన్స్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ప్రభాస్ ద్వారా ఈ ట్రైలర్ జనంలోకి వెళ్లినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలను ప్రీ రిలీయేజ్ ఈవెంటులో మాట్లాడతాను" అంటూ చెప్పుకొచ్చాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.