అక్కడ రజినీని కొట్టేవాడే లేడు..!

Update: 2022-10-31 23:30 GMT
బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి RRR తో అది కొనసాగించారు. RRR వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అయ్యింది. థియేట్రికల్ రన్ రికార్డులు సృష్టించగా ఓటీటీలో కూడా వరల్డ్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

నెట్ ఫ్లిక్స్ లో 14 వారాల పాటు టాప్ లో ఉన్న సినిమా RRR. ఈ జోష్ తోనే రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ చేశారు. జపాన్ లో ఫస్ట్ వీక్ 73 మిలియన్ యాన్ లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బాహుబలి సినిమా అక్కడ ఫుల్ రన్ లో 300 యాన్ లు కలెక్ట్ చేసింది. బాహుబలికి భారీగా ప్రమోషన్స్ చేశారు. అఫ్కోర్స్ RRR ని కూడా అదే రేంజ్ లో ప్రమోట్ చేశారు.

ట్రిపుల్ R ఫుల్ రన్ లో కూడా 200 మిలియన్ యాన్ లకు అటు ఇటుగా కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ తొలి వారం 73 మిలియన్ యాన్ లు కలెక్ట్ చేసినా.. బాహుబలి 300 మిలియన్ యాన్ లు వసూళ్లు రాబట్టినా ఎప్పుడో పాతికేళ్ల క్రితం రిలీజైన రజినీ సినిమా రికార్డ్ మాత్రం చెరపలేకపోయారు.

జపాన్ లో రజినీకాంత్ కి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే రజినీ నటించిన అన్ని సినిమాలు జపాన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఇప్పుడేదో బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ జపాన్ లో రిలీజ్ చేసి హడావిడి చేస్తున్నారు కానీ పాతికేళ్ల క్రితమే జపాన్ లో రజిని ముత్తు సినిమా రికార్డ్ వసూళ్లను రాబట్టింది.

ఇప్పటి టికెట్ రేట్ల కన్నా అప్పుడు చాలా తక్కువ. పబ్లిసిటీ కూడా అంత గొప్పగా ఉండదు. అయినా కూడా రజినీ ముత్తు సినిమా జపాన్ లో 400 మిలియన్ యాన్ లను సాధించింది. ఈ రికార్డ్ ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరో బ్రేక్ చేయలేదు.

బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలు ఎన్నొచ్చినా సరే రజినీ రికార్డ్ మాత్రం అలానే ఉంటుంది. రజినీ ముత్తు సినిమా రికార్డ్ మళ్లీ రజినీనే బ్రేక్ చేయాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఏది ఏమైనా ఇండియన్ సినిమా రికార్డులన్ని తిరగరాసిన బాహుబలి, RRR సినిమాలు జపాన్ లో రజినీ రికార్డ్ బ్రేక్ చేయలేకపోవడం తెలుసుకున్న తమిళ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు .


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News