ప్రతి ఏడాది కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కి కొత్త ఉత్సాహం తెప్పిస్తాయి కొత్త సినిమాలు. ఇక పెరిగిన మార్కెట్ దృష్ట్యా నేషనల్ వైడ్ గా కూడా దుమ్ముదులిపేందుకు వచ్చాయి. 2022 లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఉన్నాయి. ఆ అంచనాలను మించి ఆడిన సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ కి ఊపు తెప్పించిన సినిమాల లెక్క ఎలా ఉందో ఒకసారి చూస్తే.. ముందుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ ఇది. ఎవరిని తక్కువ చూపించినా మరొకరి ఫ్యాన్స్ చేసే గొడవని తట్టుకోలేం అయినా సరే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరిని బ్యాలెన్స్ చేసిన తీరు అద్భుతం అమోఘం.
ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాల లిస్ట్ లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ గా నిలిచింది ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లెవల్ లో కూడా హంగామా కొనసాగించింది. అవార్డులు రివార్డుల గురించి అయితే లెక్కే లేదు. సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టాడు. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ కూడా బాక్సాఫీస్ కి ఊపు తెచ్చేలా చేసింది. ఇక ఈ లిస్ట్ లో బాక్సాఫీస్ కి ఊపు తెప్పించిన మరో సినిమా F3. F2కి సీక్వల్ గా అదే పాత్రలని కొనసాగిస్తూ చేసిన ఈ సినిమా అనీల్ రావిపుడి మార్క్ ఎంటర్టైనింగ్ మూవీగా ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ఈ ఏడాది ప్రేక్షకులను ప్రేమానురాగాల్లో ముంచెత్తేలా చేసిన సినిమా సీతారామం. హను రాఘవపుడి డైరెక్షన్ లో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగుతో పాటుగా సౌత్ అన్ని భాషల్లో ఒకేసారి రిలీజైంది. హిందీలో కూడా తర్వాత రిలీజై సక్సెస్ అందుకుంది.
ఇక 2022 బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి నిఖిల్ కార్తికేయ 2. కార్తికేయ 1 ని కొనసాగిస్తూ కార్తికేయ 2 చేయగా ఊహించని విధంగా ఆ సినిమా నేషనల్ వైడ్ సూపర్ ట్రెండ్ అయ్యింది. నిఖిల్ అండ్ టీం కూడా ఈ సినిమా చేసిన అద్భుతాలను ఊహించలేదని చెప్పొచ్చు. 100 కోట్ల మార్క్ తో ఈ ఏడాది అసలు సిసలైన హిట్ బొమ్మగా నిలిచింది కార్తికేయ 2. ఇక ఏడాది చివర్లో నిఖిల్ 18 పేజెస్ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుకుమార్ కథతో వచ్చిన ఈ సినిమాను సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశారు.
2022 లో రెండు హిట్ సినిమాలను అందించారు యంగ్ హీరో అడివి శేష్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తీసిన మేజర్ సినిమాతో ఒక హిట్ అందించగా రీసెంట్ గా హిట్ 2 తో మరో సక్సెస్ అందించారు. బాక్సాఫీస్ కళకళలాడటంలో తన వంతు కృషి చేశాడు అడివి శేష్.
ఈ ఏడాది మొదట్లో డీజే టిల్లు హంగామా తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సిద్ధు జొన్నలగడ్డ చేసిన హంగామా అదిరిపోయింది. టిల్లు హంగామాకి బాక్సాఫీస్ కూడా కళకళలాడింది. శర్వానంద్ ఒకే ఒక జీవితం కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి హిట్ గా నిలిచింది. కళ్యాణ్ రాం బింబిసార కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది. కళ్యాణ్ రాం ఖాతాలో మంచి హిట్ సినిమాగా నిలిచింది బింబిసార.
ఈ ఏడాది వచ్చిన బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ మసూద. కొత్త వారితో చేసిన ఈ ప్రయత్నం మౌత్ టాక్ తో సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా చూసిన ఆడియన్స్ అంతా సూపర్ రెస్పాండ్ అవుతూ సినిమా హిట్ లో భాగమయ్యారు.
ఇక ఈ ఏడాది చివరి హిట్ గా ధమాకా మూవీ అని చెప్పొచ్చు. రవితేజ మార్క్ మాస్ మసాలా సినిమాగా ధమాకా వచ్చింది. స్టోరీలో పెద్దగా విషయం లేకపోయినా మాస్ రాజా ఫ్యాన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. ఫుల్ రన్ లో ఈ సినిమా మంచి లాభాలు తెచ్చేలా ఉందని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.