ఒక సినిమా హిట్ ప్లాప్ అనే విషయాలు బాక్సాఫీస్ వద్ద అది వసూలు చేసే కలెక్షన్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. వసూళ్ళు బాగా లేకపోతే ఆ మూవీని ప్లాప్ కిందే లెక్కగడతారు. టాలీవుడ్ లో భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్స్ గా మిగిలిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి.
ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన స్టార్ హీరోల సినిమాలు పరాజయం పాలైనప్పుడు మాత్రం బయ్యర్లు భారీ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ తో నిర్మాతలు అంతో ఇంతో బయటపడే అవకాశం ఉంటుంది కానీ.. రిటర్న్స్ వెనక్కి రాకపోతే కొనుగోలుదారులే పీకల్లోతు కష్టాల్లో పడే పరిస్థితి వస్తుంది. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తెలుగు చిత్ర పరిశ్రమలో బయ్యర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!
టాలీవుడ్ లో ఎక్కువ నష్టాలు చవిచూసిన సినిమాగా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో అతిపెద్ద ప్లాప్ గా 'రాధేశ్యామ్' టాప్ లో నిలిచింది. ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పీరియాడికల్ లవ్ డ్రామా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాదాపు 120 కోట్ల నష్టాలు మిగిల్చిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
పవన్ కళ్యాణ్ సిల్వర్ జూబ్లీ మూవీ 'అజ్ఞాతవాసి' బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సుమారు 67 కోట్లు నష్టం వాటిల్లింది. మహేష్ బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'స్పైడర్' సినిమాకు 59 కోట్లు లాస్ వచ్చిందని తెలుస్తోంది.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో' సినిమా వల్ల 52 కోట్లు నష్టపోయారు. ఎన్టీఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. 'ఎన్టీఆర్ - కథానాయకుడు' 50 కోట్లు నష్ట పోయేలా చేస్తే.. 'ఎన్టీఆర్ - మహానాయకుడు' చిత్రం 47 కోట్లకు పైగా లాస్ వచ్చేలా చేసింది.
చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాకు 43 కోట్ల నష్టం వచ్చింది. మహేష్ చేసిన '1 నేనొక్కడినే' చిత్రానికి 42 కోట్లు.. 'బ్రహ్మోత్సవం' సినిమాకు 38.8 కోట్లు నష్టం వాటిల్లింది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా 37 కోట్ల లాస్ తో తర్వాతి స్థానంలో నిలిచింది. అఖిల్ అక్కినేని డెబ్యూ మూవీ 'అఖిల్' కు 28 కోట్లు నష్టం వచ్చింది.
అలానే పవన్ చేసిన 'కొమరం పులి' సినిమా వల్ల 26.7 కోట్లు నష్టపోయారు. 12 ఏళ్ల కిందటే అన్ని కోట్లు నష్టం తెచ్చిపెట్టిందంటే అది ఎంతటి డిజాస్టర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్ కెరీర్ లో పెద్ద ప్లాప్ గా 'వినయ విధేయ రామ' (26.6 కోట్ల నష్టం) సినిమా నిలిచింది. 'ఆరెంజ్' (26 కోట్లు) - 'తుఫాన్' (25 కోట్లు) - 'బ్రూస్ లీ' (25 కోట్లు) సినిమాలు కూడా నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల జాబితాలో ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ నటించిన రీమేక్ మూవీ 'కాటమమరాయుడు' కూడా 25 కోట్ల మేర నష్టం వచ్చేలా చేసింది. లెక్కలు తెలియనప్పటికీ పవన్ రీ ఎంట్రీ తర్వాత చేసిన 'వకీల్ సాబ్' 'భీమ్లా నాయక్' సినిమాలు కూడా బయ్యర్లకు నష్టాలు మిగిల్చాయని ట్రేడ్ టాక్. ఇక రీసెంట్ గా విడుదలైన RRR సినిమాకు లాంగ్ రన్ లో కొన్ని ఏరియాలలో నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.