టాలీవుడ్ లో కొందరి హీరోల్ని బ్యాడ్ టైమ్ బంతాడేస్తోందా? వరుస పరాజయాలతో ఇబ్బందులు తప్పడం లేదా? హీరోగా క్రేజ్ ఉన్నా హిట్ కొట్టలేని పరిస్థితితో సతమతమవుతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. మాస్ రాజా రవితేజ.. నేచురల్ స్టార్ నాని..యంగ్ హీరో శర్వానంద్.. యూత్ స్టార్ నితిన్ ఇదే పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. హీరోలందరికీ మంచి క్రేజ్ ఉంది. కానీ ఆ క్రేజ్ హిట్ వరకూ దారి తీయడం లేదు. జనాల్ని థియేటర్ కి రప్పించడంలో విఫలయత్నమే కనిపిస్తుంది. ఇదంతా హీరోల బ్యాడ్ టైమ్ గానే హైలైట్ అవుతుంది.
'క్రాక్' తో సక్సెస్ అందుకున్న మాస్ రాజా మహారాజా అటుపై నటించిన సినిమాలతో వరుస వైఫల్యాలు అందుకున్నాడు.'ఖిలాడీ'..'రామారావు' వరుస పరజయాలు చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లైనప్ లో మూడు..నాలుగు సినిమాలున్నా? రెండు చిత్రాల పరాభవం ఈ లైనప్స్ మార్కెట్ పై తీవ్ర ప్రభవాన్ని చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
యంగ్ హీరో శర్వానంద్ కూడా ఇదే పరిస్థితులో ఉన్నాడు. 'మహానుభావుడు' తర్వాత యువ హీరోకి చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు. 'శ్రీకారం'..'ఆడవాళ్లు మీకు జోహార్లు' లాంటి చిత్రాలు సోసో గా ఆడాయి తప్ప శర్వా ఇమేజ్ తో జనాల్ని థియేటర్లకి రప్పించలేకపోయాడు. పాజిటివ్ టాక్ వచ్చినా జనాలు థియేటర్ కి రాలేదంటే? అక్కడ క్రేజ్ ఎంతగా వర్కౌట్ అవుతుందన్నది అద్దం పడుతుంది. ప్రస్తుతం ఆ యువహీరో 'ఒకే ఒక్క జీవితం' అనే సినిమా చేస్తున్నాడు. ఆశలన్నీ ఈ సినిమాపైనే కనిపిస్తున్నాయి.
ఇక నేచురల్ స్టార్ నానికి 'ఎంసీఏ' తర్వాత సరైన కమర్శియల్ పడలేదు. 'జెర్సీ' సినిమాకి మంచి పేరొచ్చినప్పటికీ వసూళ్ల పరంగా రికార్డు స్థాయిలో వినబడలేదు. 'శ్యామ్ సింఘరాయ్'..'అంటే సుందరానికీ' చిత్రాలకి పాజిటివ్ టాక్ వచ్చింది గానీ..బాక్సాఫీస్ వద్ద కాసులు రాలేదు. ఆ కోవలో చూస్తే? నేచురల్ స్టార్ ఇమేజ్ కొంత వరకే పరిమితమని తెలుస్తోంది. ప్రస్తుతం నటిస్తోన్న 'దసరా'పైనే ఆశలన్నీ కనిపిస్తున్నాయి. ఈ చిత్రం మాస్ ఎంటర్ టైనర్ గా మెప్పిస్తుందని ఆశలు పెట్టుకున్నాడు.
అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ సైతం ఇదే ఫేజ్ లో ఉన్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నటించిన 'రెడ్'..'వారియర్' చిత్రాలు నిరాశపరిచాయి. ఇటీవల రిలీజ్ అయిన 'వారియర్' తో ట్రాక్ లోకి వచ్చేస్తాడని భావించారుగానీ.. ఫలితంతో నిరాశ తప్పలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.
ఇక యూత్ స్టార్ నితిన్ 'భీష్మ' తర్వాత సక్సెస్ రుచి చూసింది లేదు. 'చెక్'..'రంగదే'..'మ్యాస్ర్టో' వరుస వైఫల్యాలు చెందాయి. ఇటీవల రిలీజ్ అయినా 'మాచర్ల నియోజకవర్గం' సైతం అదే మార్గంలో పయనిస్తుంది. 'మాచర్ల'తో కమర్శియల్ గా హిట్ అందుకోవచ్చని యూత్ స్టార్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. కానీ ఫలించలేదు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ అన్వేషణలో ఉన్నట్లు తెలుస్తోంది.
వీళ్లంతా టాలీవుడ్ లో క్రేజీ హీరోలే. వంద కోట్లు వసూళ్లు తేగల సత్తా ఉన్న స్టార్స్ . కానీ ఎవరికి టైమ్ కలిసి రావడం లేదు. చేసిన ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ఒక్క హిట్ అంటూ తపిస్తున్నారు. కొడితే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టరే అవుతుంది. ఆ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారంతా.