బాలీవుడ్ మాఫియా వ‌ల్ల‌నే వీళ్లంతా హ‌త్య‌కు గుర‌య్యారా?

Update: 2020-08-03 15:00 GMT
సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం బాలీవుడ్ కి ఎన్నో ప్ర‌శ్న‌ల్ని వేస్తోంది. వీటికి స‌మాధానం చెప్ప‌లేక బాలీవుడ్ ప్ర‌ముఖులు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఒక సెక్ష‌న్ సుశాంత్ సింగ్ ని వెన‌కేసుకొస్తుంటే మ‌రో సెక్ష‌న్ మీడియా బాలీవుడ్ పెద్ద‌ల్ని వెన‌కేసుకొస్తోంది. ప్ర‌ముఖ టీవీ చానెళ్ల డిబేట్లు అంత‌కంత‌కు బాలీవుడ్ ని అట్టుడికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌క్యాత రిప‌బ్లిక్ టీవీ సుశాంత్ సింగ్ కి అనుకూలంగా బాలీవుడ్ బిగ్ షాట్ల‌ను టార్గెట్ చేస్తోంది. అర్నాబ్ గోస్వామి డిబేట్ క‌ల‌క‌లం రేపుతోంది. అయితే దీనికి కౌంట‌ర్ గా ఎన్డీటీవీ స‌హా ప‌లు చానెళ్లు పోరాటం సాగిస్తున్నాయి. అర్నాబ్ పై ఆర్జీవీ కౌంట‌ర్ వేరొక కోణం.

ఇదంతా ఇలా ఉంటే ఈ డిబేట్ల‌లో సుశాంత్ పేరుతో పాటు శ్రీ‌దేవి.. దివ్య భార‌తి.. జియాఖాన్ వంటి క‌థానాయిక‌ల పేర్ల‌ను డ్రాగ్ చేయ‌డం మ‌రింత హీట్ పెంచుతోంది. జియా ఖాన్ మర్డ‌ర్ మిస్ట‌రీ గురించి పాంచోళీలు కోర్టుల్లో పోరాడాల్సొచ్చింది. అది ఇప్ప‌టికీ అనుమానాస్ప‌ద మృతినే. అలాగే దివ్య‌భార‌తి ముంబైలోని ఆకాశ హార్మ్యం నుంచి జారిప‌డిపోయింద‌ని పుకార్. కానీ అది హ‌త్యేన‌ని ఆ త‌ర్వాత కోర్టుల ప‌రిధిలో విచార‌ణ సాగించారు. చివ‌రికి ఏదీ తేల‌‌లేదు.

దుబాయ్ లోని ఓ స్టార్ హోట‌ల్లో పెళ్లి వేడుక జ‌రుగుతుండ‌గా అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి బాత్రూమ్ లో జారిప‌డి మ‌ర‌ణించింద‌న్న వార్త సంచ‌ల‌న‌మైంది. అది నిజం కాద‌ని అభిమానులు స‌హా ఎవ‌రూ న‌మ్మ‌లేదు. కానీ ఈ కేసులోనూ దుబాయ్ పోలీసులు జారి ప‌డి మ‌ర‌ణించింద‌నే ధృవీక‌రించారు. మొన్న‌టికి మొన్న సుశాంత్ సింగ్ మ‌ర‌ణం సైతం ఇలానే అనుమానాస్ప‌దం కావ‌డంతో పోలీసులు నెల‌ల కొద్దీ విచార‌ణ సాగిస్తున్నారు. ప్ర‌తిసారీ మాఫియా క‌నెక్ష‌న్ పై ప్ర‌శ్న త‌లెత్తింది. ఇలాంటి అనుమాన‌పు కేసుల్లో టీవీ డిబేట్లు మ‌రింత అనుమానాలు రేకెత్తించి ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొట్ట‌డం స‌రైన‌దేనా? ఈ హ‌త్య‌ల‌న్నీ బాలీవుడ్ మాఫియా లింకుల వ‌ల్ల‌నే జ‌రిగిన‌వా? అన్న‌ది మ‌రో కొత్త అనుమానం మొద‌లైంది.
Tags:    

Similar News