ఒకప్పుడు పెళ్లి తర్వాత హీరోయిన్ గా రాణించడం దాదాపు అసాధ్యంగానే కనిపించేది. వివాహం అనంతరం శరీరం సహా రూప లావణ్యంలో వచ్చే మార్పులతో అవకాశాలకు దూరమయ్యేది కొందరైతే? కావాలని నిష్ర్కమించేవారు మరికొంత మంది ఉండేవారు. ఏది ఏమైనా వివాహం వృత్తిగత జీవితాని అడ్డంకిగా ఉండేదన్నది వాస్తవం.
ఒకవేళ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పెళ్లికి ముందున్నంత మైలేజ్ దక్కేది కాదు. కుటుంబం..పిల్లలు అంటూ సంసార జీవితంలోనే మునిగిపోయేవారు. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా గా మారాయి. పెళ్లి తర్వాతా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. ఒకప్పుడు ఈవిధానం ఎక్కువగా బాలీవుడ్ లో కనిపించేది.
కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కొంత మంది భామలు 2.0 వెర్షన్ తో దూసుకుపోతున్నారు. పెళ్లైనా..బిడ్డలకు తల్లైనా...తగ్గేదేలే అంటూ నవ నాయికలకే పోటీగా నిలుస్తున్నారు. అందులో ముందు వరుసలో ఉన్న బ్యూటీ సమంత. నాగ చైతన్యతో వివాహం అనంతరం సామ్ సినిమా కెరీర్ ఎలా సాగిందో చెప్పాల్సిన పనిలేదు.
ఓ వైపు భార్యామణి బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలు చేసింది. ఇక చైతో బ్రేకప్ తర్వాత అదే దూకుడు కొనసాగిస్తుంది. ఇంకా చెప్పాలంటే విడాకుల తర్వాత మరింత వేగంగా ముందుకు కదులుతుందనాలి. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ అవకాశాలు ఒడిసి పట్టుకుంటుంది. వెబ్ సిరీస్ ల్లో సైతం నటిస్తూ సామ్ సత్తా చాటుతోంది. అలాగే హాట్ బ్యూటీ నయనతార కెరీర్ చూస్తే పెళ్లికి ముందు.. తర్వాత పెద్ద వ్యత్యాసం కనిపించలేదు.
పెళ్లికి ముందు తరహాలోనే పెళ్లి తర్వాత అదే ఛరిష్మా..గ్రేస్ తో దూసుకుపోతుంది. ఇటీవలే గాడ్ ఫాదర్ లో నటించింది. బ్యూటీ అందానికి మరోసారి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పెళ్లైనా అందం ఇసుమెత్తు కూడా తరిగిపోలేదంటూ కామెంట్లు పెట్టారు. నయన్ డేట్లు స్టార్ హీరోలే క్యూ కడుతున్నారు. బాద్ షా షారుక్ నే నయన్ కోసం వెయిట్ చేస్తున్నాడంటే? నయన్ రేంజ్ తెలియడం లేదు.
ఇక చందమామ కాజల్ అగర్వాల్ ఏకంగా ఓ బిడ్డకు తలైంది. మామ్ అయినా సరే కాజల్ మెరుపులు తెరపైకి కొనసాగుతూనే ఉంటాయని రివీల్ చేసింది. ప్రస్తుతం 'ఇండియన్ -2'లో నటిస్తోంది. ఇంకా కొత్త ఛాన్స్ లు కోసం వెయిట్ చేస్తోంది. ఐటం పాటల్లో నటించడానికి రెడీగా ఉంది. అలాగే సన్నజాజి సోయగం శ్రియ కూడా ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికే అదే అందాన్ని మెయింటెన్ చేస్తోంది.
రూపంలో ఎలాంటి మార్పులు రాలేదు. 20 ఏళ్ల క్రితం నాటి శ్రియని చూసినట్లే ఉంది. టాలీవుడ్..బాలీవుడ్..కోలీవుడ్ అంటూ అన్ని భాషల్ని చుట్టేస్తోంది. మరోవైపు కలువ అమలాపాల్ కూడా కోలీవుడ్ లో విడాకుల తర్వాత దూసుకుపోతుంది. ఏ.ఎల్ విజయ్ తో ప్రేమ..పెళ్లి అనంతరం సినిమాలకు దూరమవుతుందని భావించినా అమల పడి లేచిన కెరటంలా ముందుకు సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.