వాటికి కూడా కూడా సెన్సార్ ఉండాలి అంటున్న గౌతమి

Update: 2023-01-07 06:51 GMT
ఓటీటీ ల యొక్క ప్రభావం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ఆ కారణంగా వెబ్ సిరీస్ లకు మంచి ఆధరణ లభిస్తుంది. భాష తో సంబంధం లేకుండా అన్ని భాషల్లో కూడా ఈ మధ్య కాలంలో వెబ్‌ సిరీస్ లు వస్తున్నాయి. ఒక మంచి కథను సినిమా గా కంటే వెబ్‌ సిరీస్ గా ఎక్కవ న్యాయం చేకూర్చే విధంగా చూపించవచ్చు.

అందుకే వెబ్‌ సిరీస్ లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం సీనియర్ నటి గౌతమి కూడా ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్టోరీ ఆఫ్ థింగ్స్ అనే వెబ్‌ సిరీస్‌ లో గౌతమి నటిస్తున్నారు. వెబ్‌ సిరీస్ అనగానే అడల్ట్‌ కంటెంట్‌ గుర్తుకు వస్తున్న నేపథ్యంలో గౌతమి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వెబ్‌ సిరీస్ లో అడల్ట్ కంటెంట్‌ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా సెన్సార్‌ అవసరం అన్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర సెన్సార్‌ బోర్డ్‌ సభ్యురాలిగా ఉన్న గౌతమి ముందు ముందు వెబ్‌ సిరీస్ లకు సెన్సార్ ఉండే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుతానికి వెబ్‌ సిరీస్ ల యొక్క సెన్సార్ కార్యక్రమాలు జరగడం లేదు.. కానీ ఓటీటీ లకు స్వీయ సెన్సార్‌ అవసరం అన్నట్లుగా కేంద్ర సమాచార శాఖ గతంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని వెబ్‌ సిరీస్ లు మరీ అడల్ట్ కంటెంట్‌ ప్రధానంగా సాగుతున్నాయి. కనుక వాటిపై సెన్సార్‌ కొరఢ ఝులిపించాల్సిన అవసరం ఉందని గౌతమి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక తాను నటిస్తున్న స్టోరీ ఆఫ్‌ థింగ్స్ వెబ్‌ సిరీస్ గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా ఒక మంచి ఫీల్ ఉన్న సిరీస్ గా ఇది నిలుస్తుంది అన్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ సిరీస్‌ ను అన్ని ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News