ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు కానీ స్టార్డం మాత్రం చాలా తక్కువమందికే వస్తుంది. ఇక సూపర్ డూపర్ హిట్లు సాధించకపోయినా స్టార్డం తెచ్చుకోవడం అరుదుగా కానీ జరగదు. పూజా హెగ్డే అలాంటి అరుదైన కేటగిరీనే. ఇప్పటివరకూ ఆమె కెరీర్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిఖార్సైన హిట్టు లేదు. కానీ క్రేజీ ప్రాజెక్టులలో హీరోయిన్ గా నటిస్తూ తోటి హీరోయిన్లకు అసూయపుట్టేలా చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' లో పూజా హీరోయిన్. ఈ చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ సంగతులు పంచుకుంది.
'మహర్షి' సినిమా విషయంలో దర్శకుడు వంశీ పైడిపల్లిపై తనకు చాలా కోపంగా ఉందని చెప్పింది. ఈ సినిమాలో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుందామని అనుకుందట. కానీ వంశీ పైడిపల్లి ససేమిరా అన్నాడట. 'అరవింద సమేత' లో పూజా తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. అలానే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పుకుందామంటే వీలుపడలేదని చెప్పింది.
ఇక తన కెరీర్ లో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడుతూ పోయినేడాది నాలుగు సినిమాల్లో నటించిందట. కొన్ని రోజులు మూడు షిఫ్టులలో కూడా నటించాల్సి వచ్చిందట. అలా ఒకటైమ్ లో ఉదయం 7 -12 ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' చేశాను.. మధ్యాహ్నం 2 - 6 వరకు మహేష్ తో 'మహర్షి' చేశాను.. రాత్రి 9 - 2 గంటల వరకు ప్రభాస్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను అని చెప్తూ అది నా కెరీర్ లో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పింది. మరి నిద్ర సరిపోయిందా అని అడిగితే తనకు జస్ట్ నాలుగైదు గంటల నిద్ర చాలట. తక్కువ సేపు పడుకుంటే అందంగా కనిపిస్తానని మురిపెంగా చెప్తోంది.