2022 కి ఎండ్ కార్డ్ పడబోతుంది.. 2023 కి గ్రాండ్ వెల్కం చెప్పబోతున్నారు. 2022 లో వచ్చిన సినిమాల్లో తమకు నచ్చిన విభాగాల్లో ది బెస్ట్ అనిపించుకున్న వాటి గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేస్తున్నారు. బెస్ట్ సాంగ్.. బెస్ట్ మూవీ.. బెస్ట్ హీరో ఇలా అన్నిటి గురించి సోషల్ మీడియా హంగామా చేస్తుండగా బెస్ట్ ఎలివేషన్ సీన్ గురించి కూడా చర్చల్లోకి వచ్చింది. ఇంతకీ 2022 బెస్ట్ ఎలివేషన్ సీన్ ఏది అంటే అందరు ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ ఇంటర్వల్ సీన్ కే ఓటు వేశారు.
మామూలుగానే రాజమౌళి తన సినిమాల్లో హీరోలకు ది బెస్ట్ ఎలివేషన్ ఇస్తాడు. రాజమౌళి ఇచ్చే ఎలివేషన్ ముందు మరే డైరెక్టర్ ఎలివేషన్ పనికిరాదనే చెప్పాలి. అయితే ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ కి ఒక బెస్ట్ ఎలివేషన్.. తారక్ కి బెస్ట్ ఎలివేషన్ ఇచ్చాడు. కానీ వీటిని మించి ఇంటర్వల్ లో ఎన్.టి.ఆర్ జంతువులతో ట్రక్కు నుంచి దూకే సీన్ అందరికి నచ్చేసింది. ఆ సీన్ గురించి మన వాళ్లే కాదు నార్త్ సైడ్ ఆడియన్స్ సెలబ్రిటీస్ కూడా ప్రత్యేక చర్చ జరిపారు.
ఇక ఇప్పుడు అదే 2022 ది బెస్ట్ ఎలివేషన్ సీన్ గా నెట్టింట గెలిచింది. నెటిజన్లు ఎక్కువగా ఆ సీన్ నే బెస్ట్ ఎలివేషన్ సీన్ గా ఓటు వేశారు. అంతేకాదు ఆ సీన్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ చూపించిన అభినయం మరోసారి అతనిలోని నటుడిని ఆవిష్కరించింది. ఇక సినిమాలో సీతారామరాజుగా చరణ్ కూడా తన అద్భుతమైన నటనతో మెప్పించారు.
ట్రిపుల్ ఆర్ సినిమాకు చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు మెయిన్ పిల్లర్స్ గా నిలిచారు. ఇక కీరవాణి మ్యూజిక్ మరో హైలెట్ గా నిలిచింది. ఇవన్ని కలిసి ఆర్.ఆర్.ఆర్ ని ఆ స్థాయిలో నిలబెట్టాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ లకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది. సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకోగా రాబోయే రోజుల్లో మరెన్నో అవార్డ్ లను అందుకుంటుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.