'ఇది ఇండియాలోనే అతిపెద్ద సెట్'.. ఆచార్యుడు చెప్పిన ధర్మస్థలి విశేషాలు..!
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ''ఆచార్య'' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ చివరి నిమిషం వరకూ ప్రమోషన్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు - స్పెషల్ వీడియోలను వదులుతున్నారు.
''ఆచార్య'' సినిమా ధర్మస్థలి అనే టెంపుల్ టౌన్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా జరుగుతుందని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థం అవుతుంది. అయితే దీని కోసం ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్ పర్యవేక్షణలో.. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇరవై ఎకరాల్లో అద్భుతమైన 'ధర్మస్థలి' సెట్ ని నిర్మించారు. తాజాగా చిరంజీవి ఓ వీడియో ద్వారా ఈ సెట్ గురించి వివరించారు.
''ఆచార్య సినిమా కోసం కోకాపేటలో టెంపుల్ టౌన్ ని నిర్మించాం. కొరటాల శివ స్టోరీ చెప్పినప్పుడు.. ఓ పవిత్రమైన పురాతన దేవాలయం - చుట్టూ కొండలు - పక్కనే నది.. ఆ పక్కనే గూడేలు.. ఉండే ప్రాంతంలో జరుగుతుందని చెప్పారు. కానీ ఇవన్నీ కలిసుండే లొకేషన్ ఎక్కడ దొరుకుతుందని నాకు మొదటి నుంచి సందేహం ఉంది. అలాంటి ప్రాంతాన్ని వెతకడం కష్టమని, కోకాపేటలో టెంపుల్ టౌన్ సెట్ ను నిర్మించాం'' అని చిరంజీవి తెలిపారు.
'"20 ఎకరాల్లో ఈ భారీ సెట్ నిర్మించాం. ఇందులో అగ్రహాలు - పెద్ద పెద్ద మండపాలు - గాలి గోపురాలు - ఒక పెద్ద దేవీ విగ్రహం - గూడేలు ఉంటాయి. ఇవన్నీ చూసి చాలా థ్రిల్ గురయ్యాను. ఇదే ఒకవేళ రియలిస్టిక్ లొకేషన్ కు వెళ్లి చేయాలి అనుకుంటే.. 'ఆచార్య' సినిమా ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉండేది. ఈ సెట్ ఇంత అద్భుతంగా రావడానికి ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ కారణం. ఇండియాలో ఒక సినిమా కోసం 20 ఎకరాల విస్తీర్ణంలో వేసిన బిగ్గెస్ట్ సెట్ ఇదే'' అని చిరు వివరించారు.
ఇంతకుముందు దర్శకుడు కొరటాల శివ కూడా టెంపుల్ టౌన్ సెట్ గురించి వివరించారు. 'ఆచార్య' సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ధర్మస్థలి ఎక్కడ ఉందని వెతకడం ప్రారంభిస్తారని అన్నారు. పురాతన గాథలు, ఎన్నో నమ్మకాలు కలిగిన అమ్మవారి దేవాలయం ఉన్న ప్రాంతం ధర్మస్థలి. ఈ కథ ఎక్కువగా ధర్మం అనే కాన్సెప్ట్ చుట్టే ఉంటుంది కాబట్టి.. ఆ టెంపుల్ టౌన్ కి 'ధర్మస్థలి' అనే పేరు పెడితే బాగుంటుందని భావించాం అని కొరటాల తెలిపారు.
''అందమైన టిపుల్ టౌన్ కోసం ఎన్నో ప్రాంతాల్లో వెతికాం. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అంశాలు మాకు నచ్చాయి. షూటింగ్ సాధ్యం కాదేమో అనిపించింది. చివరికి 'ధర్మస్థలి' సెట్ వేయాలని నిర్ణయించుకున్నాం. నిర్మాతలు కూడా ఓకే అన్నారు. దాంతో ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ ఎన్నో ప్రాంతాలకు వెళ్లి రీసెర్చ్ చేశారు. సెట్ ను నిర్మించే సమయంలో పూజలు చేసేవాళ్ళం. దేవాలయాల పవిత్రత ఎక్కడా దెబ్బతినకుండా సెట్ నిర్మించాం. సినిమా చూసిన తర్వాత ధర్మస్థలికి వెళ్లాలనే ఆలోచన ప్రతి ఒక్కరికీ వస్తుంది. అదొక అందమైన ప్రదేశం. 20 ఎకరాల్లో వేసిన బిగ్గెస్ట్ సెట్ ఇది" అని కొరటాల వివరించారు.
కాగా, 'ఆచార్య' సినిమాలో చిరంజీవి - రామ్ చరణ్ నక్సల్స్ గా కనిపించనున్నారు. చరణ్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. తిరు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మించారు.
Full View