ఇది భారత జెండా.. అమెరికాలో 'తగ్గేదేలే' అంటున్న అల్లు అర్జున్

Update: 2022-08-22 05:55 GMT
పుష్ప రాజ్ అమెరికాలో మెరిసాడు.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ కు అమెరికా జనం నీరాజనాలు పలికారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియా డే పరేడ్ వేడుకకు అల్లు అర్జున్ సారథ్యాన్ని వహించారు. న్యూయార్క్ లో ఈ ర్యాలీ ఏర్పాటైంది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, మన్ హట్టన్ లలో నివసించే భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూయార్క్ నగరంలో ఇండియా డే పరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించిన ఐకాన్ స్టార్ బన్నీకి అక్కడి మేయర్ ఆడమ్స్ 'సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్' బహూకరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పరేడ్ జరిగింది. అందులో అల్లు అర్జున్ భారతదేశ గొప్పతనాన్ని వివరించారు.  'యే భారత్ కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ' అంటూ పుష్ప డైలాగ్ తో ఉత్సాహపరిచాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి లభించిన అరుదైన గౌరవం, న్యూయార్క్ లో జరిగే ఇండియా డే పరేడ్ కి ఈ ఏడాది యావత్ భారత్ దేశానికి ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు,  అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ గారితో కలిసి పాల్గొన్నారు. దాదాపుగా ఈ పరేడ్ కి ఐదు లక్షలు మందికి పైగా భారతీయలు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తమ్ముకున్న అభిమానాన్ని చాటుకున్నారు, ఇంత స్థాయిలో న్యూయర్క్ డే పరేడ్ కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.

ఈ సందర్శన లో భాగంగా న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. వారి సంభాషణల మధ్యలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఎరిక్ ఆడమ్, ప్రపంచ వ్యాప్తంగా విశేష జనాధరణ పొందిన తగ్గేదేలే డైలాగ్ అలానే ఫోజ్ పెట్టడం విశేషం.

అల్లు అర్జున్ తోపాటు ప్రఖ్యాత గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ సహా చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రెటీలు ఇందులో పాల్గొన్నారు. కిందటి నెలలోనే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ నాలుగో పరేడ్ కౌన్సిల్ భేటి సందర్భంగా అల్లు అర్జున్ ఆహ్వానించాలని నిర్ణయించారు.

ఈ ర్యాలీలో పలువురు భారతీయులు పాల్గొన్నారు. అసోసియేషన్ చైర్మన్ అంకుర్ వైద్య సహా వివిధ సంఘాల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడారు. హిందీలో ఆయన మాట్లాడడం ఆకట్టుకుంది. భారతీయుడిగా జన్మించడం పట్ల గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ అత్యంత శక్తివంతమైనదిగా అభివర్ణించారు. గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల వల్ల రెండు, మూడేళ్లుగా దీన్ని నిర్వహించడం లేదు. ఇప్పుడా పరిస్థితులు లేకపోవడం వల్ల మరింత గ్రాండ్ గా ర్యాలీని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఘనంగా చేపట్టింది.మన్ హట్టన్ లోని మ్యాడిసన్ అవెన్యూ మీదుగా ర్యాలీ కొనసాగింది. దీనికి గ్రాండ్ మార్షల్ గా అల్లు అర్జున్ వ్యవహరించారు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' మూవీ తర్వాత అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ మూవీ దేశంలోనే కాదు.. ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అమెరికాలో కూడా ఇప్పుడు పుష్పరాజ్ అందుకే ఇంత అభిమానం దక్కింది. పుష్ప2 ఇప్పుడు సెట్స్ మీద ఉంది.
Tags:    

Similar News