అడివి శేషు హీరోగా శశికిరణ్ తిక్కా 'మేజర్' సినిమాను రూపొందించాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. మహేశ్ బాబు ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమా, నిన్ననే భారీ స్థాయిలో విడుదలైంది. తొలి ఆటతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై అడివి శేష్ మాట్లాడుతూ .. " సినిమా రిలీజ్ అయిన వెంటనే అదే పనిగా ఫోన్ మోగితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనేసి అర్థం. నిన్నటి నుంచి నా ఫోన్ ఫ్రీజ్ అయిపోయింది .. ఇక కొత్తది కొనుక్కోవాలి.
'మేజర్' సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. అందరూ కూడా ఇంత పెద్ద హిట్ అయిన తరువాత ఇంకేంటి .. హాయిగా తడి గుడ్డేసి పడుకో అంటున్నారు. అలా అంటుంటే నాకు నవ్వొస్తుంది .. ఎందుకంటే మేజర్ సందీప్ స్పిరిట్ ను ప్రజలవరకూ తీసుకుని వెళ్లడానికి ఇంకా ఏం చేయగలం అని నేను ఆలోచిస్తున్నాను.
ఆయన విషయం దగ్గరికి వచ్చేసరికి ఏం చేసినా సరిపోదనిపిస్తుంది. నా లాస్ట్ మూవీ 'ఎవరు' కంటే ఈ సినిమా 5 రెట్లు వసూళ్లను రాబట్టినట్టుగా చెబుతున్నారు. కానీ నేను చెప్పేదేమిటంటే ఎమోషన్ కి విలువకట్టలేం.
ఈ ఎమోషన్ ఇంకా పెద్దది కాబోతోందని ఇప్పుడు చెబుతున్నాను. సందీప్ గారి గురించి నాకు అర్థమైనదేమిటంటే మన గోల్ చేరుకునేవరకూ ఎలాంటి పరిస్థితుల్లోను ఆగకూడదు అని. ఈ సినిమా రిలీజ్ కి ముందువరకూ సందీప్ గారి పేరెంట్స్ తో ఉన్నాను.
ఈ వేదికపై వాళ్లు లేకపోవడంతో వాళ్లని చాలా మిస్సవుతున్నాను. ఈ సక్సెస్ మీట్ కాగానే వాళ్లకి కాల్ చేస్తాను. అలాగే ఇక్కడ అబ్బూరి రవిగారు లేకపోవడం నాకు కాస్త వెలితిగా ఉంది. ఈ సినిమా విషయంలో నన్ను గైడ్ చేసింది ఆయనే. సందీప్ గారి జీవితచరిత్రను చాలా తక్కువ టైమ్ లో ఎలా చూపించాలనేది ఆయన గైడ్ చేశారు.
ఈ సినిమాతో మా టీమ్ కి వచ్చిన ఒక ఐడియా చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా చూసిన తరువాత మేము ఆర్మీలో జాయిన్ అవుదామని అనుకుంటున్నాము అంటూ మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఆర్మీ .. నేవీలో జాయిన్ కావాలకుని రీసోర్సెస్ లేక కష్టపడుతున్న వాళ్లకి సపోర్ట్ గా నిలబడాలని నిర్ణయించుకున్నాము. ఎలా అనే ఒక ప్లానింగ్ ను త్వరలో బయటపెట్టబోతున్నాము. మీదుగా ఒక చిన్న ప్రయత్నంతోనే మొదలుపెడతాం .. ఆ తరువాత అది కోట్లకి చేరుకుంటుందని భావిస్తున్నాము .. ఇది 'మేజర్' చేస్తున్న ప్రామిస్" అంటూ ముగించాడు.