రీ ఎంట్రీ ఇవ్వడానికి అసలు కారణం ఇదే: వేణు తొట్టెంపూడి

Update: 2022-07-28 13:18 GMT
స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, ఇలా ఎన్నో విభిన్నమైన కమర్షియల్ సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్న వేణు తొట్టెంపూడి ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. అతను నటించిన సినిమాల్లో కామెడీ కూడా చాలా బాగుండేది. అలాగే ఊహించని పంచ్ లతో కూడా ఎంతగానో ఆకట్టుకునేవాడు. అప్పట్లో కొత్తవారికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చిన హీరోలలో వేణు తొట్టెంపూడి ఒకరు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి వేణు ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

స్వయంవరం సినిమాకు త్రివిక్రమ్ కథ మాటలు అందించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత వేణు 2009 వరకు చాలా బిజీగా సినిమాలు చేసుకుంటూనే వచ్చాడు. అతను బాక్స్ ఆఫీస్ వద్ద చివరగా మంచి సక్సెస్ అందుకుంది అంటే వంశీ దర్శకత్వంలో వచ్చిన 'గోపి గోపిక గోదావరి'. ఇక ఆ తర్వాత పెద్దగా సక్సెస్ రాకపోవడంతో చివరగా దమ్ము సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాడు. 2013లో రామాచారి అనే సినిమా చేసిన వేణు ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ సినిమాల వైపు చూడలేదు.

ఎక్కువగా తన వ్యాపారాలతోనే బిజీగా మారిపోయాడు. ఇప్పుడు మళ్లీ చాలాకాలం తర్వాత రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ద్వారా వెండి తెరకు రీఎంట్రీ ఇస్తున్నారు. రీఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏమిటి అనే విషయాలను ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఎక్కువగా తన వ్యాపారాలతో బిజీగా ఉండిపోవడం వలన ఎన్ని అవకాశాలు వచ్చిన మధ్యలో సినిమాలు చేయలేకపోయాను అని అయితే లాక్ డౌన్ లో కొన్ని వెబ్ సిరీస్ లో ఓటీడీలో సినిమాలు చూడడం వలన నాకు మళ్ళీ నటన అనే పొరుగు పుట్టింది అని అన్నారు.

నేను వెండితెరకు దూరమవుతున్నాను అనే భావన కలిగింది. ఇక అదే సమయంలో రామారావు దర్శకుడు శరత్ నేను మీ అభిమానిని అంటూ ఒకసారి కలవాలి అని నా దగ్గరకు వచ్చాడు. ఇంకా అప్పటికి నేను సినిమాలో నటించాలని అనుకోలేదు. కానీ అతను కథ చెప్పగానే ఎంతో కనెక్ట్ అయ్యా.

ఈ సినిమాలో మురళి అనే ఒక సీఐ పాత్రలో కనిపించబోతున్నాను. ఈ సినిమాలో నా పాత్ర నెగిటివ్ పాజిటివ్ అని కాకుండా మంచి ఛాలెంజింగ్ గా అనిపించింది. అలాగే ప్రస్తుతం చాయ్ బిస్కెట్ వారితో ఒక సినిమా చేస్తున్నట్లుగా వేణు తొట్టెంపూడి వివరణ ఇచ్చాడు.
Tags:    

Similar News