ట్రెండింగ్: బ‌న్ని ఫ్యామిలీ మాల్దీవుల విహారంలో స్పెష‌ల్ ఇదే

Update: 2021-04-04 15:30 GMT
ఇటీవ‌లే 18 సంవ‌త్స‌రాల కెరీర్ పూర్త‌యిన ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు బ‌న్ని. ఇన్నాళ్లు త‌న‌ని ఆద‌రించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాజాగా మ‌రో ఆనంద‌క‌ర విష‌యం‌తో మ‌రోసారి అభిమానుల ముందుకొచ్చారు బ‌న్ని. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి త‌మ వార‌సుల‌తో క‌లిసి ప్ర‌స్తుతం మాల్దీవుల విహార‌యాత్ర‌లో ఉన్నారు. సౌత్ సూపర్ స్టార్ బ‌న్ని ఇన్ ‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఈ విహారానికి సంబంధించిన ఫోటోలు రివీల‌య్యాయి‌.

బ‌న్ని వార‌సుడు అయాన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ఫో‌టోల్ని ఇంత‌కుముందే బ‌న్ని షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. భార్య స్నేహ రెడ్డి కుమార్తె అర్హా కూడా ఫ్రేమ్ లో క‌నిపించ‌గా.. ఈ ఫోటో అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అయ్యింది. తాజాగా మాల్దీవుల యాత్ర నుంచి వ‌రుసగా ఫోటోలు ఇన్ స్టాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ విహార‌యాత్ర‌లో స్నేహారెడ్డి తన లేడీ గ్యాంగ్ ‌తో కలిసి దిగిన పలు ఫొటోలను ఇన్ ‌స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. `సిస్టర్‌ స్క్వాడ్` అన్న క్యాప్ష‌న్ తో ఈ ఫోటోలు రిలీజ‌య్యాయి. బ‌న్ని న‌టిస్తున్న పుష్ప‌ ఆగస్టు 13న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నెల 7 సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్ ‌గా బన్నీని ప్రజలకు పరిచయం చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. టీజ‌ర్ కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.
Tags:    

Similar News