యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలికి ముందు వరకు ఏడాదికి ఒకటి రెండు సినిమాలను చేస్తూ వచ్చాడు. అప్పుడు ప్రభాస్ సినిమాల బడ్జెట్ మీడియంగా ఉండేది.. ఆయన సినిమాలు మీడియం రేంజ్ అన్నట్లుగా ఉండేవి. ఎప్పుడైతే బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడో అప్పటి నుండి ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బాహుబలి సినిమా కోసం ఫ్యాన్స్ ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమాకు దాదాపుగా రెండేళ్ల సమయం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక రాధేశ్యామ్ కోసం ఫ్యాన్స్ దాదాపుగా మూడు సంవత్సరాలు వెయిట్ చేశారు. గత ఏడాది విడుదల అయిన రాధేశ్యామ్ తర్వాత రాబోతున్న సినిమా ఆదిపురుష్.
ప్రభాస్ ఆదిపురుష్ నుండి వరుసగా సినిమాలను అందించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సలార్ సినిమా ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదే ఏడాది చివర్లో సలార్ ను విడుదల చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆదిపురుష్ మరియు సలార్ లు 2023 సంవత్సరంలో విడుదల అవ్వడం నూరు శాతం పక్కా అన్నట్లుగా ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు.
మరో వైపు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రాజెక్ట్ కే లు 2024 లో విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ప్రభాస్ నుండి ఏడాదికి రెండు సినిమాల చొప్పున బ్యాక్ టు బ్యాక్ సినిమా లు ఇక నుండి రాబోతున్నాయి.
ఒకప్పుడు ప్రభాస్ సినిమా యొక్క అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూసిన రోజులు చాలా ఉన్నాయి. అలాంటి రోజుల నుండి ఇప్పుడు ఆయన సినిమాలు ఏడాదికి రెండు చొప్పున రాబోతున్నాయి అంటే కచ్చితంగా అభిమానులు పండగ చేసుకోవచ్చు. ప్రభాస్ అభిమానులకు ఇదే కదా కావాల్సింది.