ఇంట్లోకి కూడా వెళ్ళలేకపోయిన ముమాయత్

Update: 2017-07-29 08:19 GMT
కేవలం ఒక రోజు విచారణ కోసం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది ముమాయత్ ఖాన్. మొన్న హైదారాబాదులో సిట్ విచారణకు వచ్చిన ముమాయత్.. కనీసం ఇంటికి కూడా వెళ్ళంది ఇందుకోసమేనట.

విషయం ఏంటంటే.. ఇప్పుడు బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన ముమాయత్.. పూణె ఎయిర్ పోర్టు నుండి డైరక్టుగా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఎయిర్ పోర్టు ప్రాంగణంలోని నోవోటెల్ హోటల్లో ఉంది. అక్కడి నుండి ఆబ్కారి భవన్ కు విచారణకు వచ్చేసి తిరిగి వెళ్ళిపోయింది. అయితే హైదారబాదులో ఆమెకు ఒక అపార్ట్ మెంట్ ఉందని.. అక్కడికి ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నిస్తున్నారు జనాలు. కాని ఆమె వెంటే ఉన్న బిగ్ బాస్ ప్రతినిథులు.. ఆమె షోలో తిరిగి పాల్గొనాలంటే.. ఖచ్చితంగా ఆమె ఇలా బయటకు వచ్చినప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడకూడదని.. సెల్ ఫోన్ సంభాషణ కాని.. స్వయంగా కలుసుకోవడం కాని చేయకూడదని నిబంధనలు పెట్టారట. అందుకే ముమాయత్ ఇంటికెళ్ళకుండా హోటల్లో ఉంది.

ఇకపోతే ఒక రోజు సెలవు తీసుకున్న ముమాయత్ ఇప్పుడు తిరిగి బిగ్ బాస్ లోకి వచ్చేసింది. మొత్తానికి బిగ్ బాస్ చరిత్రలో చాలామంది వారాలకు వారాలు గ్యాప్ తీసుకుంటే.. ఇప్పుడు ముమాయత్ మత్రం సింగిల్ డే సెలవు తీసుకుని చక్కగా మళ్లీ హౌస్ లోకి వచ్చేసింది.
Tags:    

Similar News