ఉపేంద్ర .. తెలుగు తెరపైకి దూకుడుగా వచ్చిన హీరో. లుక్ తోనే కాదు యాక్టింగ్ పరంగా కూడా తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన హీరో. తెలుగు తెరపై అప్పటివరకూ ఆ స్థాయి ఉన్మాదంతో ఏ సినిమాలు రాలేదు. అలాంటి సమయంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఉపేంద్ర .. తెలుగు ప్రేక్షకుల ముందుకు ' ఓంకారం' సినిమాను తీసుకుని వచ్చాడు. ఈ సినిమాకి ఉపేంద్ర కథ .. స్క్రీన్ ప్లే .. దర్శకత్వం చేశారు. రాజశేఖర్ నటనలోని కొత్త కోణాన్ని ఆయన ఆవిష్కరించిన తీరు గురించి అంతా మాట్లాడుకున్నారు. ఎవరబ్బా ఈ డైరెక్టర్ అనుకుని ఆలోచనలో పడ్డారు.
ఇక ఆ తరువాత ఉపేంద్ర కన్నడలోనే కాదు, తెలుగులో కూడా హీరోగా చేయడం మొదలుపెట్టారు. ఒక సినిమా టైటిల్ 'A' అయితే .. మరో సినిమా టైటిల్ 'రా' .. ఇంకో సినిమాకి తన పేరుతోనే 'ఉపేంద్ర' అనే టైటిల్ పెట్టేశారు. తన లుక్ .. ఆ పాత్ర ప్రవర్తన .. కథ .. అంతా కూడా కాస్త తేడాగానే ఉండేవి. అయితే అది కొత్తగా అనిపించడంతో, ఒక వర్గం ప్రేక్షకులను ఆయన ఆకట్టుకున్నారు. మొదటి నుంచి కూడా ఆయన యాక్షన్ ను .. ఎమోషన్ ను పండించే తీరులో తీవ్రత ఎక్కువగా ఉండేది. 'టాస్' సినిమా తరువాత ఆయన తెలుగు తెరపై పెద్దగా కనిపించలేదు. కన్నడలోనే వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.
'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ఫుల్. హీరోకి .. ఈ పాత్రకి మధ్యనే కథ ఎక్కువగా నడుస్తుంది. ఆ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఆయన.
మళ్లీ ఇప్పుడు 'గని' సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. "24 ఏళ్ల క్రితం నేను 'ఓంకారం' సినిమా చేసేటప్పుడే, అశ్వనీదత్ నిర్మాతగా చిరంజీవిగారి సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది.
అయితే అప్పుడు ఉన్న కొన్ని పరిస్థితుల కారణంగా ఆ సినిమా చేయలేకపోయాను. నిజంగా అది నా బ్యాడ్ లక్. ఆ సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉంటాను. అప్పట్లోనే చిరంజీవి గారు నాకు ఛాన్స్ ఇచ్చారు.
ఆ తరువాత అల్లు అర్జున్ గారి 'సన్నాఫ్ సత్యమూర్తి'తోనే నేను రీ ఎంట్రీ ఇచ్చాను. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ గారు నన్ను గుర్తుపెట్టుకుని మరీ ' గని' కోసం పిలిపించారు. ఇలా మెగా ఫ్యామిలీ ఎప్పటికప్పుడు నాకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఇదంతా చూస్తుంటే మెగా ఫ్యామిలీతో నాకు మెగా అనుబంధమే ఉన్నట్టుగా అనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు.