ఈ వారం కూడా ఓటీటీ లో సందడే సందడి

Update: 2022-12-30 11:39 GMT
ప్రతి వారం థియేటర్ల ద్వారా సినిమాలు ఎలా అయితే వచ్చి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయో అదే విధంగా ఓటీటీ ద్వారా సినిమాలు మరియు సిరీస్‌ లు ఇంకా షో లు వచ్చి సందడి చేస్తున్న విషయం తెల్సిందే. గత రెండు సంవత్సరాలుగా ఇండియన్ ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్‌ ను వీకెంట్స్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ వారం కూడా వీకెండ్‌ లో ఎంజాయ్ చేసేందుకు గాను పలు సినిమాలు మరియు సిరీస్ లు షో లు ఉన్నాయి. తెలుగు లో అన్‌ స్టాపబుల్‌ షో తో బాలకృష్ణ వారం వారం కొత్త గెస్ట్ లతో అలరిస్తూ ఉన్నాడు. ఈ వారం బాలయ్య షో లో ప్రభాస్ సందడి చేశాడు. గత రెండు మూడు వారాలుగా ప్రభాస్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు ప్రభాస్ ఎపిసోడ్‌ ను ఆహా ఓటీటీ స్ట్రీమింగ్‌ చేసింది. హీరో ప్రభాస్ ఎపిసోడ్‌ ను చూసేందుకు ఆహా ను ఒక్కసారిగా ప్రేక్షకులు లాగిన్‌ అవ్వడంతో యాప్ క్రాష్ అయ్యింది. ఇంకా తెలుగు ప్రేక్షకులు అన్‌ స్టాపబుల్‌ కాకుండా సినిమా లు సిరీస్‌ లను ఎంజాయ్‌ చేసే విధంగా ఓటీటీ లో కంటెంట్‌ రెడీ గా ఉంది.

సౌత్‌ సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 ను హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేసిన విషయం తెల్సిందే. థియేట్రికల్‌ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హిందీ దృశ్యం 2 ను అమెజాన్ ప్రైమ్‌ స్ట్రీమింగ్‌ చేస్తోంది. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించిన మిలి సినిమాను నెట్‌ ఫ్లిక్స్ లో ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించిన తమిళ్ చిత్రం డీఎస్పీ నెట్ ఫ్లిక్స్ ద్వారా తెలుగు భాష లో కూడా అందుబాటులో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఓటీటీ లో ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఇక అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన బటర్ ఫ్లై డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వైవిధ్యభరిత థ్రిల్లర్ అనుపమ అభిమానులకు విందు భోజనం అనడంలో సందేహం లేదు. ఇక మలయాళం మూవీ గోల్డ్‌ కూడా ఈ వారంలోనే ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసేందుకు స్ట్రీమింగ్‌ అయ్యింది. తెలుగు భాష లో కంటెంట్‌ కాస్త తక్కువ ఉన్నా కూడా ఇతర భాష సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు సబ్‌ టైటిల్స్ తో చూసి ఎంజాయ్ చేసే వెసులుబాటు ఉంది. కనుక ఈ వారం కూడా ఓటీటీ లో సందడే సందడి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News