కరోనా తర్వాత బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై సౌత్ సినిమాల ఆదిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది బాలీవుడ్ లో కంటే మెజార్టీ విజయాలు సౌత్ లో నమోదు అయ్యాయి. అంతే కాకుండా అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాలు కూడా సౌత్ నుండే ఉన్నాయి. హిందీ సినిమాలతో పోల్చితే సౌత్ ఇండియన్ భాషల సినిమాలు గత ఏడాది స్పష్టమైన ఆధిపత్యం కనబర్చడం జరిగింది.
ఈసారి కూడా అదే పద్ధతి కంటిన్యూ అయ్యింది. హిందీ సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. రెండు మూడు సినిమాలు కాస్త పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. హిందీ కి చెందిన పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ పరిస్తితి బాగా లేదని ఓటీటీ వైపు అడుగులు వేయడం ఈ ఏడాది కూడా అక్కడ కనిపించింది.
ఇక సౌత్ లో ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్స్ నమోదు అయ్యాయి. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గత ఏడాదే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.
ఇక కేజీఎఫ్ 2 సినిమా కూడా సంచలన విజయాన్ని నమోదు చేయడం తో అంతా కూడా నోరు వెళ్ల బెట్టారు. వెయ్యి కోట్లకు పైగా కేజీఎఫ్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఆర్ఆర్ఆర్ ను మించి కేజీఎఫ్ 2 కలెక్షన్స్ ను రాబట్టడం మనం చూశాం.
ఇక కన్నడంలోనే రూపొంది విడుదల అయిన కాంతార సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఉత్తర భారతంలో దాదాపుగా వంద కోట్లను రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది. ఇక తమిళ విక్రమ్ సినిమా కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. హిందీ ప్రేక్షకులకు చాలా కాలం తర్వాత కమల్ స్టామినా ఏంటో మళ్లీ అర్థం అయ్యింది.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరించారు. వందల కోట్ల వసూళ్లు రాబట్టిన పొన్నియన్ సెల్వన్ తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మొత్తానికి ఈ సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్ లో కూడా తమ స్టామినాను చూపించి హిందీ సినిమాలపై పైచేయి సాధించాయి. వచ్చే ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.