అల్లరి సినిమాతో తెరంగేట్రం చేసిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడు నరేష్ మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో ఒకప్పుడు వరుస హిట్లు కొట్టిన అల్లరోడు ఈమధ్య కెరీర్ పరంగా చాలా వెనకపడ్డాడు. నరేష్ సినిమా హిట్ కొట్టి చాలా రోజులైంది. అందుకే తన పంథా మార్చి సీరియస్ రోల్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అలా చేసిన నాంది మూవీ సూపర్ హిట్ అయ్యింది. నాంది ఇచ్చిన కిక్ తో అల్లరి నరేష్ వరుస సీరియస్ సినిమాలే చేస్తున్నాడు.
లేటెస్ట్ గా మోహన్ డైరెక్షన్ లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో వస్తున్నారు అల్లరి నరేష్. సినిమాలో కూడా నరేష్ సీరియస్ పాత్రలో కనిపిస్తున్నారు. నంది ఇచ్చిన కాన్ఫిడెన్స్ కావొచ్చు.. డైరెక్టర్ మోహన్ చెప్పిన కథ కావొచ్చు నరేష్ మరోసారి సీరియస్ కథతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఒకప్పుడు ఏడాదికి నాలుగు సినిమాలు దాకా రిలీజ్ చేసి సక్సెస్ రేటు కూడా బాగానే ఉన్న అల్లరి నరేష్ కెరీర్ లో పూర్తి గా ఫాం కోల్పోయాడు. చేస్తున్న సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో గ్రాఫ్ పడిపోయింది.
నాందితో మళ్లీ పుంజుకున్నాడు అల్లరి నరేష్. సినిమాలు అన్నాక ఒక్కోసారి ఊహించిన దాని కన్నా ఎక్కువ రిజల్ట్ అందుకుంటాయి.. ఒక్కోసారి అంచనాలు భారీగా ఉండి బోల్తా కొడతాయి. ఈ రెండిటినీ ఈక్వల్ గా తీసుకోవాలని అంటున్నారు అల్లరి నరేష్.
అంతేకాదు నాన్న కాలం చేశాక తన కెరీర్ చూసి నాన్న గారు ఉంటే బాగుండేదని అంటున్నారు. అలాంటి కామెంట్స్ కొన్ని తన మనసుకి బాధ కలిస్తాయని అన్నారు అల్లరి నరేష్. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ఇది అందరికి తెలియాల్సిన కథ అని అంటున్నారు అల్లరి నరేష్.
సీరియస్ కథలే కాదు తన మనసుకు నచ్చిన కామెడీ స్టోరీస్ కూడా చేస్తానని అంటున్నారు అల్లరి నరేష్. సీరియస్, కామెడీ సినిమాలు రెండిటినీ బ్యాలెన్స్ చేస్తానని అన్నారు. అయితే ఈమధ్య కామెడీ సినిమాలు చాలా తగ్గాయని ఓ మంచి కథ వస్తే మాత్రం తన స్టైల్ లో ఒక కామెడీ సినిమా చేస్తానని అన్నారు అల్లరి నరేష్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.