ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ హీరోయిన్ పాత్రను చేసిన పాయల్ రాజ్ పూత్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. మొదటి సినిమాలో బోల్డ్ పాత్ర అవ్వడంతో ఆమెకు ఎక్కువ అలాంటి పాత్రలే దక్కుతున్నాయి. ప్రేక్షకులు కూడా పాయల్ నుండి అలాంటి పాత్రలను ఆశిస్తున్నారు. తాజాగా పాయల్ నటించిన చిత్రం 'ఆర్డీఎక్స్ లవ్'. ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మొదటి సినిమా తరహాలోనే ఆర్డీఎక్స్ లవ్ చిత్రంలో కూడా పాయల్ చాలా బోల్డ్ గా నటించిందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.
వరుసగా ఇలాంటి పాత్రల్లో నటించడం పట్ల కుటుంబ సభ్యుల స్పందన ఏంటీ అంటూ ఒక ఇంటర్వ్యూలో ఈమెను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పింది. నేను ఏదైనా సినిమాకు ఒప్పుకున్నప్పుడు ఆ సినిమాలో ఉండే బోల్డ్ సీన్స్ గురించి అమ్మకు ముందే చెప్పేస్తాను. ఇన్ని లిప్ లాక్ సీన్స్ ఉన్నాయట.. పాత్ర కోసం ఇలా ఉండాలట.. ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ ఉంటాయట అంటూ అన్ని విషయాలను అమ్మతో చెప్తాను. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అమ్మతో షేర్ చేసుకుంటాను. నా ఇష్టానుసారంగా అమ్మ వదిలేస్తుంది.
బోల్డ్ పాత్రలు చేయడం ఇష్టం.. కాని ఆ పాత్రల్లో నటించినప్పుడు ఆ సినిమాలను అమ్మా నాన్నలతో కలిసి చూడటం కష్టంగా ఉంటుంది. కాని ఆర్డీఎక్స్ లవ్ చిత్రంలో ఇంటిమేట్ సీన్స్ ఉన్నా కూడా ఆ సినిమాను నేను అమ్మా నాన్నలతో చూడాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆర్డీఎక్స్ లవ్ చిత్రంతో నటిగా మరో స్థాయిని పాయల్ వెళ్తానన్న నమ్మకంతో ఉంది.