మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న చిరు.. తర్వాత నటించబోయే మూడు ప్రాజెక్ట్స్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. డైరెక్టర్ మెహర్ రమేష్ తో చిరు సినిమా చేస్తున్నాడని ఇటీవలే పవన్ కళ్యాణ్ కంఫర్మ్ చేశాడు. అలానే బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి ఓ మూవీ చేస్తున్నట్లు పూరీ జగన్నాథ్ చేసిన ట్వీట్ తో క్లారిటీ వచ్చేసింది. వీటితో పాటు మాస్ డైరెక్టర్ వీ వీ వినాయక్ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మెగా డైరెక్టర్స్ ముగ్గురూ ఒకచోట కలిశారు. ఈ రోజు డైరెక్టర్ వి వి వినాయక్ పుట్టినరోజు సందర్భంగా వీరు కలిసినట్లు అర్థం అవుతోంది. మెహర్ రమేష్ తన ట్విట్టర్ ఖాతాలో వినాయక్ - బాబీ లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ 'మెగా ఫ్యాన్స్' అని క్యాప్షన్ పెట్టాడు. 'మెగాస్టార్ లైన్లో పెట్టిన ముగ్గురు డైరెక్టర్స్' అని మెహర్ హింట్ ఇస్తున్నాడని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలానే చిరుతో సూపర్ హిట్ సినిమాలు తీయాలని కోరుతున్నారు.
కాగా, చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదలమ్' తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. 2015లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన ఈ చిత్రం తమిళ్ లో ఘన విజయం సాధించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందని చిరంజీవి భావించి ఈ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెహర్ మూడేళ్ళ పాటు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించనున్నారని సమాచారం. అలానే మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' తెలుగు రీమేక్ ని కూడా లైన్లో పెట్టాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ రీమేక్ కు వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివతో కలిసి వినాయక్ తెలుగు ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్టుగా 'లూసిఫర్' కథలో మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో రామ్ చరణ్ మరియు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు.