'బేధియా' నుంచి విజువ‌ల్ ట్రీట్ రెడీ!

Update: 2022-10-28 02:30 GMT
బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో కుర్ర హీరోల్లో క్రేజీ స్టార్ గా మారిపోతున్నాడు. ఇటీవ‌ల ఆ వేగం కాస్త త‌గ్గిన‌ట్లు అనిపించినా? వ‌రుణ్ కెరీర్ పై ఆప్ర‌భావం పెద్ద‌గా ప‌డ‌ల‌దు. కొత్త క‌మిట్ మెంట్ల జోరు ఏమాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం వ‌రుణ్ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి.

అందులో ఒక‌టి వ‌రుణ్ హీరోగా అమ‌ర్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో `భేదియా` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ తోనే హారర్ కామెడీపై క్యూరియాసిటీ క్రియేట్ చేసి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గామారింది. తాజాగా తొలి సాంగ్ రిలీజ్ కి కౌంట్ డౌన్ మొద‌లైంది.

థుమ్కేశ‌వారీ సాంగ్ ని మ‌రికొన్ని గంట‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. అక్టోబ‌ర్ 28న సాంగ్ రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దానికి సంబంధించిన‌ ప్రోమో ఒక‌టిప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. అంద‌మైన ఓ భారీ సెట్ లో ఈ పాట‌ని చిత్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.  విజువ‌ల్ గా సాంగ్ ని హైలైట్  చేయ‌డం కోసం భారీగానే ఖ‌ర్చు చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.

వ‌రుణ్ ధావ‌న్..కృతి స‌న‌న్ పై ఈ బ్యూటీఫుల్ సాంగ్ ని చిత్రీక‌రించారు. మ‌రి ఈసాంగ్ విజువ‌ల్ గా ఎంత అందంగా ఉంటుంద‌న్నది చూడాలి. తొలి సాంగ్ అనంత‌రం ఒక్కో పాట రిలీజ్ తో శ్రోత‌ల్ని అల‌రించ‌నున్నారు.  ఈచిత్రాన్ని మడాక్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై దినేష్ విజయ్‌  నిర్మిస్తున్నారు.

 కాగా దినేష్ విజన్‌.. హార్రర్‌ కామెడీ యూనివర్స్‌లో మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. గతంలో ఈ యూనివర్స్‌లో తెరకెక్కిన స్త్రీ.. రూహీ సినిమాలు భారీ విజయాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్రాంచైజీ నుంచి వ‌స్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొంటున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News