ఇంకా చెవిలో పూలెందుకు?

Update: 2018-07-02 06:13 GMT
బాలీవుడ్ తారల మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి  రూమర్స్ రావడం కామన్. కానీ అవి ఓ లిమిట్ వరకు వస్తే.. తారలు పెద్దగా పట్టించుకోరు. కానీ లిమిట్స్ దాటితే ఎలాంటి వారైనా కూడా కౌంటర్ ఇచ్చేస్తారు. అయితే అందరూ నిజాలు చెబుతున్నారని గ్యారెంటీ లేదు. ఎదో ఒక మూమెంట్ లో దొరికిపోక తప్పదు. ప్రస్తుతం సోషల్ మీడియా కూడా బాలీవుడ్ మీడియాకు తోడయ్యింది. అసలు మ్యాటర్ లోకి వస్తే దిశా పటాని - టైగర్ ష్రాఫ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది.

వీరి మధ్య బాలీవుడ్ లో ప్రతిసారి ఎదో ఒక టాక్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఎలాంటి అవకాశాలు సక్సెస్ లు లేని దిశా పటాని ని రికవర్ చేసిన రియల్ హీరో టైగర్ ష్రాఫ్ అనే చెప్పాలి. గ్లామర్ షోతో అందరిని ఆకట్టుకున్నప్పటికి లోఫర్ భామ పెద్దగా అవకాశాలు అందుకోలేదు. పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ టైగర్ తో సాన్నిహిత్యంగా ఉంటోంది. అయితే రూమర్స్ వస్తున్న ప్రతిసారి మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేస్తున్నారు. ఇక రీసెంట్ గా అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకకు వీరిద్దరూ ఎంట్రీ ఇచ్చిన తీరు అందరిని ఆశ్చరపరిచింది.

ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ - శ్లోక మెహతా ఎంగేజ్మెంట్ ఇటీవల గ్రాండ్ గా జరిగింది. దాదాపు బాలీవుడ్ తారాగణం మొత్తం ఈ వేడుకలో ప్రత్యక్షమయ్యింది. అయితే అందరూ ఓ లెవెల్ లో ఎంట్రీ వచ్చినప్పటికీ టైగర్ ష్రాఫ్ - దిశా మాత్రం కపుల్స్ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మిడియలో వైరల్ అవుతున్నాయి. ఇంకా చెవిలో పూలెందుకు? లవర్స్ అని ఈజీగా అర్థమైపోతోంది అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News