ఇండస్ట్రీలో హిట్టు మాత్రమే మాట్లాడుతుంటుంది. ఒక్క హిట్టు పడిందా ప్రాధామ్యాలు మారిపోతుంటాయి. లెక్కలు మొదలవుతాయి. ఏది చేయాలో ఏది చేయకూడదనే రిస్ట్రిక్షన్స్ స్టారటవుతాయి. దీంతో హిట్టుకు ముందు అనుకున్న ప్రాజెక్ట్ లు నచ్చకపోతే వాటిని అర్థాంతరంగా వదిలేయాల్సి వస్తూ వుంటుంది.
తాజాగా యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ అలాంటి పనే చేసినట్టుగా తెలుస్తోంది. ఇందు కోసం తనకు హిట్టిచ్చిన నిర్మాతకే షాకవ్వాల్సి వచ్చిందట. వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా సరైన్ బ్రేక్ కోసం ఎదురుచూశాడు యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ.
అన్నీ కలిసొచ్చి తను అనుకున్నట్టుగానే 'డీజే టిల్లు' మూవీతో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. రిలీజ్ కు ముందు హీరోయిన్ పుట్టు మచ్చల వ్యవహారం వివాదం కావవడంతో ఈ సినిమా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఫైనల్ గా సినిమా సూపర్ హిట్ అయింది. నిర్మాతకు ఊహించని విధంగా కాసుల పండ పండించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో ఆయన మలయాళ హిట్ ఫిల్మ్ 'కప్పెల'ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రోషన్ మాథ్యూ' శ్రీనాథ్ బాసీ' అన్నాబెన్ కీలక పాత్రల్లో ముస్తఫా డైరెక్ట్ చేసిన ఈ మూవీ మలయాళంలో చిన్న చిత్రాల్లో సంచలన విజయాన్ని సాధించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో 'బుట్టబొమ్మ' పేరుతో సూర్యదేవర నాగవంశీ రీమేక్ చేస్తున్నారు. ఇందులో సిద్ధాఊ జొన్నలగడ్డ హీరో. అయితే 'డీజే టిల్లు'కు ముందు అంగీకరించిన ఈ చిత్రంలో తనది నెగెటివ్ పాత్ర అంట.
ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తాజాగా సిద్దూ జొన్నలగడ్డ తప్పుకుని ప్రొడ్యూసర్ కు షాకివ్వడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. 'డీజే టిల్లు' తో సిద్దూ జొన్నలగడ్డ సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సక్సెస్ క్రేజ్ ని కాపాడుకుంటూ హీరోగా ముందుకు వెళ్లాలనుకుంటూ ప్రత్యేకంగా కేరీర్‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సమయంలో 'కప్పెల' రీమేక్ లో నెగెటివ్ క్యారెక్ట్ చేయడం కరెక్ట్ కాదని భావించి ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని డైరెక్ట్ గా నిర్మాతకే చెప్పేశాడట.
సిద్దూ చెప్పిన రీజన్ తో ముందు షాక్ అయిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆ తరువాత హీరోగా మనమే హిట్ ని అందించి మళ్లీ విలన్ గా అతని కెరీర్ కు ఇబ్బందులు కలిగించడం కరెక్ట్ కాదని ఓకే చెప్పేశారట. ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ స్థానంలో మరో యంగ్ హీరో కోసం అన్వేషణ మొదలు పెట్టారట. ఈ రీమేక్ చిత్రాన్ని 'బుట్టబొమ్మ' పేరుతో రీమేక్ చేస్తున్నారు.