2001 సంవత్సరంలో బాబీ డియోల్.. అమీషా పటేల్ జంటగా గడార్ అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల దర్శకుడు టిను వర్మ ఏర్పాట్లు చేస్తున్నాడు. సెట్స్ లో అంతా సైలెంట్ గా ఉంది. చాలా కీలకమైన ఆ యాక్షన్ సన్నివేశం కు టిను వర్మ యాక్షన్ చెప్పాడు. అంతా సవ్యంగా సాగుతుందని అనుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి చెప్పిన దానికి రివర్స్ లో చేశాడు.
టిను వర్మకు కోపం వచ్చి కట్ కట్ అంటూ అరిచాడు. అతడిని పిలిచి చెప్పింది ఏంటి.. చేసింది ఏంటీ అంటూ అరిచాడు. నీ వల్ల షాట్ వృధా అయ్యిందని అసహనం వ్యక్తం చేశాడు. రెండవ టేక్ కు వెళ్లారు.
రెండవ టేక్ లో కూడా ఆ వ్యక్తి అలాగే అడ్డదిడ్డంగా చేశాడు. దాంతో కోపంతో మండి పోయిన టిను వర్మ ఇలాంటి వాళ్లను ఎందుకు రానిస్తారు అంటూ మెడ పట్టి బయటకు నెట్టేశాడట.
అలా బయటకు నెట్టివేయబడ్డ నటుడు ఎవరో కాదు.. ఆయనే ప్రస్తుతం స్టార్ అయిన కపిల్ శర్మ. వెండి తెరపై నటుడిగా రాణించలేక పోయినా.. స్టార్ గా సూపర్ స్టార్ గా మారలేక పోయినా కూడా బుల్లి తెరపై ఆయన ఒక మెగా సూపర్ స్టార్ అనడంలో సందేహం లేదు. దేశంలోనే అత్యంత పాపులారిటీ కలిగిన షో లో కపిల్ టాక్ షో ఒకటి అనడంలో సందేహం లేదు.
వేదిక ఏది అయినా.. గెస్ట్ లు ఎవరైనా కూడా కపిల్ షో అయితే చాలు అది సూపర్ హిట్ అన్నట్లుగా పరిస్థితి మారింది. అలాంటి కపిల్ షో ను గతంలో తాను గడార్ సినిమా షూటింగ్ నుండి బయటకు తోసి వేశాను అంటూ స్వయంగా యాక్షన్ డైరెక్టర్ టిను వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
తనకు ఈ విషయం గుర్తు లేదని.. కాని ఒక సందర్బంగా స్వయంగా కపిల్ ఈ విషయాన్ని తన షో లో చెప్పాడని టిను వర్మ పేర్కొన్నాడు. కపిల్ ఇండస్ట్రీ లో పరిచయాలు ఉన్నా కూడా ఎదగడానికి చాలా కష్టపడ్డాడు. కాదు.. లేదు అన్న చోట ప్రయత్నించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు అంటూ టిను వర్మ తన ఇంటర్వ్యూలో కపిల్ పై వ్యాఖ్యలు చేశాడు.