దీపావళికి సినిమాల సందడి బాగానే ఉండేలా ఉంది. విశ్వక్ సేన్ ఓరి దేవుడా.. మంచు విష్ణు జిన్నా సినిమాలతో పాటుగా జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ కెవి డైరక్షన్ లో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన బైలింగ్వల్ మూవీ ప్రిన్స్ కూడా అక్టోబర్ 21 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మూడు సినిమాలు డిఫరెంట్ జానర్ లు అవడంతో ప్రేక్షకులు ఈ సినిమాల మీద ఆసక్తిగా ఉన్నారు. వీరితో పాటుగా డిజిటల్ రేసులో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ధనుష్ నేనే వస్తున్నా సినిమా ఉంది.
ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా నానే వరువెన్.. తెలుగులో నేనే వస్తున్నా అంటూ ఈమధ్యనే థియేట్రికల్ రిలీజ్ చేశారు. సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అందుకే అక్టోబర్ 23న ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ వీడియోలో ధనుష్ నేనే వస్తున్నా స్ట్రీమింగ్ అవనుంది. మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసినా సరే అమేజాన్ ప్రైమ్ వీడియో నుంచి మాత్రం డిజిటల్ రిలీజ్ అప్డేట్ రాలేదు.
తమిళ చిత్ర పరిశ్రమలో ధనుష్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కొన్ని సినిమాలు ఊహించని విధంగా అద్భుతాలు సృష్టిస్తాయి. అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే ధనుష్ నటనలో మాత్రం నూటికి నూరు మార్కులు కొట్టేస్తాడు. ధనుష్ నానే వరువెన్ సినిమా కన్నా ముందు తిరుచిత్రంబలం రిలీజైంది. తిరు టైటిల్ తో తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ చేశారు. తిరు మూవీకి మాత్రం పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.
తెలుగులో ధనుష్ సినిమాలు రిలీజ్ అవుతున్నా సరే సరైన ప్రమోషన్స్ లేక ప్రేక్షకులకు రీచ్ అవ్వట్లేదు. ప్రస్తుతం ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ గా తెరకెక్కుతుంది.
అయితే మేకర్స్ ఈ మూవీని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ధనుష్ ఒక మూవీ ఎనౌన్స్ చేసినా ఆ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దాదాపు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టే అని ఫిల్మ్ నగర్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.