సినిమాల కోసం బ్యాంక్ దోపిడీలు

Update: 2015-12-23 06:19 GMT
అల్లుడిని హీరోని చేయాలి.. తాను నిర్మాత కావాలి.. సినిమానే లైప్ అన్న‌ ఘాడ‌మైన కోరిక మామ - అల్లుళ్ల‌ను దోపిడీ దొంగ‌లుగా మార్చిన ఘ‌ట‌న ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. బ్యాంకు లాక‌ర్‌ లు బ‌ద్ధ‌లు కొట్టి దోపిడీలు సాగించే ఈ మామా అల్లుళ్ల క‌థ‌నం సినిమానే త‌ల‌పించే రేంజులో ఉంది. సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఇంత‌కాలం కేవ‌లం మాఫియా మాత్ర‌మే ఏల్తోంది. ఇప్పుడు బ్యాంకు దోపిడీలు చేసే దొంగ‌లు కూడా సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నార‌న్న నిజం ప‌రిశ్ర‌మ‌ను ఉలిక్కిపాటుకు గురి చేసింది. రంగారెడ్డి - చిత్తూరు - మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌ లో గ్రామీణ బ్యాంకుల్ని ఈ ముఠా కొల్ల‌గొట్టింది.

మ‌న‌సా విన‌వే - బాల మురుగ‌న్ నిర్మించారు. గూగుల్‌ లో సెర్చ్ చేసి మ‌రీ వీళ్లు గ్రామీణ బ్యాంకుల్ని ప‌సిగ‌ట్టి రెక్కీ చేసి త‌ర్వాత దోపిడీకి గురి చేసేవారు. ఈ గ్యాంగ్ రాజ‌మ్మ‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌ పై  మ‌న‌సా విన‌వే అనే సినిమా నిర్మించారు. వీళ్ల‌కు  సౌతిండియ‌న్ ఫిలింగిల్డ్‌ లో మెంబ‌ర్ షిప్ ఉంది.  టాలీవుడ్‌ లో ప‌రిచ‌యాలు పెంచుకుని వ‌రుస‌గా సినిమాలు నిర్మించే ప్లాన్‌ లో ఉన్నారు. బాల మురుగ‌న్‌.. దిన‌క‌ర‌న్‌ - సురేష్‌ ల‌తో క‌లిసి దోపిడీలు సాగించాడు.

బ్యాంకుల్ని కొల్ల‌గొట్టి త‌ప్పించుకుని పారిపోతున్న ఈ గ్యాంగ్‌ ను ఇన్నోవా కార్ ప‌ట్టించింది. ఇబ్ర‌హీంప‌ట్పంలో బ్యాంకు దోపిడీ చేసి ప‌రారీ అయిపోయేప్పుడు అక్క‌డ వ‌దిలేసిన‌ ఇన్నోవా కార్ వీరిని పోలీసుల‌కు దొరికిపోయేలా చేసింది. బెంగ‌ళూర్‌ లో ఫోర్జ‌రీలు - దొంగ‌త‌నాలు - దోపిడీలు చేశారు. మెర్సిడెస్ బెంజ్ రేంజ్ ఇళ్ల‌ను ఐడెంటిఫై చేసి  దోపిడీలు చేసేవారు. అక్క‌డ 25 దొంగ‌త‌నాలు చేశారు.

ఈ గ్యాంగ్‌ పై నిఘా వేసి కాల్ ట్రాకింగ్‌ లో పెట్టి మురుగ‌న్ గ్యాంగ్‌ ని త‌మిళ‌నాడు కంచి జిల్లాలో అరెస్టు చేశారు. 1.70  కోట్లు విలువైన బంగారం, క్యాష్‌ ని వారి నుంచి పోలీసులు రిక‌వ‌రీ చేశారు. కోట్లాది ఆస్తుల్ని సీజ్ చేశారు. ప్ర‌స్తుతం మురుగ‌న్‌ ని, ఆయ‌న భార్య‌ను అరెస్టు చేశారు. మ‌రో ఇద్ద‌రు నిందితులు సురేష్ - దిన‌క‌ర్ ప‌రారీలో ఉన్నారు. అచ్చం సినిమాని త‌ల‌పించ‌డం లేదూ?

Tags:    

Similar News