వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ 'లైగర్'. ఈ మూవీ కోసం దాదాపు మూడున్నరేళ్ల పాటు శ్రమించిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీతో భారీ క్రేజ్ తో పాటు బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేపసుకోవాలని భారీగా కలలు కన్నాడు. కానీ ఆ కలలేవీ ఫలితంచలేదు. ఆగస్టులో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిజాస్టర్ అనిపించుకుని విజయ్ దేవరకొండకు షాకిచ్చింది.
దీంతో ఒక్కసారిగా షాక్ కు గురకైన విజయ్ దేవరకొండ 'లైగర్' ఫ్లాప్ కారణంగా సైలెంట్ అయిపోయాడు. 'లైగర్' ఫ్లాప్ నుంచి తేరుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన దృష్టిని తదుపరి చిత్రం 'ఖుషీ'పై పెట్టాడు. 'లైగర్' తరువాత విజయ్ దేవరకొండ దర్శకుడు శివ నిర్వాణతో 'ఖుషీ' పేరుతో ఓ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. సమంత హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ కశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంది.
ఆ తరువాత హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఆ తరువాత నుంచి సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. విజయ్ దేవరకొండ 'లైగర్' ప్రమోషన్స్ లో బిజీగా వుండటం, సమంత 'యశోద' షూటింగ్ లో బిజీగా వుండటంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల విజయ్ దేవరకొండ అందు బాటులో వున్నా సమంత ప్రత్యేక ట్రీట్ మెంట్ నిమిత్తం యుఎస్ వెళ్లడంతో షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది.
ఎట్టకేలకు సామ్ యుఎస్ నుంచి తిరిగి రావడం, విజయ్ దేవరకొండ కూడా అందుబాటులో వుండటంతో ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ని నవంబర్ 15 నుంచి మొదలు పెట్టబోతున్నారట. కారణం సమంత నటిస్తున్న 'యశోద' మూవీ నవంబర్ 11న పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమంత సినిమా రిలీజ్ తరువాత నుంచి 'ఖుషీ' షూటింగ్ కు అందుబాటులో వుండనుందట.
ఆ కారణంగానే 'ఖుషీ' తాజా షెడ్యూల్ నవంబర్ 15 నుంచి మొదలు పెట్టబోతున్నారని ఇన్ సైడ్ టాక్. ఇదిలా వుంటే ఈ మూవీపై విజయ్ దేవరకొండ, సామ్, దర్శకుడు శివ నిర్వాణ భారీ ఆశలు పెట్టుకుంటున్నారట. ఈ ముగ్గురికి ఈ సినిమా హిట్ చాలా అవసరమని తెలుస్తోంది. ఆ కారణంగానే ఈ ముగ్గురు 'ఖుషీ' హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీని వచ్చే ఏడాది 2023 సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.