మ్యాచో హీరో.. ఇదే బెస్ట్ ఛాన్స్

Update: 2022-06-28 02:30 GMT
యాక్షన్ మ్యాచో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద వరుస అపజయలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఒకప్పుడు యజ్ఞం, రణం, లక్ష్యం శౌర్యం సాహసం ఇలా ఎన్నో విభిన్నమైన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ ఇటీవల కాలంలో మాత్రం పూర్తిస్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోతున్నారు.

అతని నుంచి ఎలాంటి సినిమా వచ్చినా కూడా పెట్టిన పెట్టుబడి లో సగం కూడా వెనక్కి తీసుకు రావడం లేదు. ఆ మధ్య వచ్చిన సిటీ మార్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే ఒక విధంగా గోపీచంద్ సరైన కథలు తగలడం లేదు అనే చెప్పాలి. అంతేకాకుండా తనకు సరైన దర్శకులతో సినిమా అవకాశాలు కూడా రావడం లేదు.

ఇక ఫైనల్ గా మంచి ఫామ్లో ఉన్న మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమాతో ఈ వారం గోపిచంద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మొన్నటి వరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు వచ్చిన పక్కా కమర్షియల్ మరో లెక్క అనే చెప్పాలి. ఎందుకంటే గోపీచంద్ గత ఐదారేళ్ల లో చేసిన సినిమాలకు ఏ విధంగానూ విడుదలకు ముందు అంతగా పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వలేదు.

కానీ ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాకు మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. దానికి తోడు ప్రభాస్ స్నేహితుడు కావడంతో అతని ఫ్యాన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే ఉంది. ఇక రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి రావడంతో ఆయన అభిమానుల సపోర్ట్ కూడా గోపీచంద్ సినిమాకు గట్టిగానే లభించింది అని చెప్పవచ్చు. ఇక సపోర్ట్ సంగతి పక్కన పెడితే ఒక కమర్షియల్ సినిమాకు మిగతా సినిమాల నుంచి కూడా పెద్దగా పోటీ అయితే లేదు.

ఏవో కొన్ని చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి కానీ వాటిపై ఎలాంటి హైప్ అయితే లేదు. ఇక ఇంతకు ముందు వచ్చిన సినిమాల హడావుడి కూడా పూర్తిస్థాయిలో తగ్గిపోయింది. విక్రమ్ సినిమాకు కూడా కలెక్షన్స్ పెద్దగా ఏమీ రావడం లేదు. కాబట్టి పక్కా కమర్షియల్ సినిమాకు ఇది బెస్ట్ రిలీజ్ టైమ్ అనే చెప్పాలి. ఒకవైపు మంచి పాజిటివ్ హైప్ తో పాటు ఎలాంటి పోటీ లేకుండా బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతోంది. కాబట్టి ఇప్పుడు మాత్రం సినిమాకు కేవలం పాజిటివ్ టాక్ వస్తేనే సక్సెస్ అవుతుంది. అని చెప్పవచ్చు. మరి కంటెంట్ విషయంలో దర్శకుడు మారుతి ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.
Tags:    

Similar News