టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో రాజశేఖర్ ఒకరు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఆయనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది. ఆయన చాలా సినిమాలు చేసినప్పటికీ పోలీస్ పాత్రలే ఎక్కువ పేరును తెచ్చిపెట్టాయి.
అలాంటి రాజశేఖర్ ఈ సారి కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రనే ఎంచుకున్నారు. ఆ పాత్ర చుట్టూ తిరిగే కథనే ఎంచుకున్నారు. అలా ఆయన 'శేఖర్' సినిమాతో ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ వేదికపై రాజశేఖర్ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి ముందు కోవిడ్ వచ్చింది .. మృత్యువుకి దగ్గరగా వెళ్లి వచ్చాను .. మీరే నన్ను బ్రతికించారు. అలాగే ఈ సినిమా చూసి మా బ్రతుకుతెరువును బ్రతికించండి. మీరంతా ఈ నెల 20వ తేదీన థియేటర్ కి వెళ్లి చూడండి. చాలామంది నా దగ్గరికి వచ్చి .. సార్ మా అమ్మానాన్నలు మీ ఫ్యాన్ ఒక సెల్ఫీ ఇవ్వండి అని అడుగుతుంటారు. వాళ్లందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను .. మీ అమ్మానాన్నలను థియేటర్ కి తీసుకుని వెళ్లి ఈ సినిమాను చూపించండి. మీరు కూడా వెళ్లి చూడండి.
ఈ సినిమా ఫస్టు షో అవగానే .. టాక్ వినగానే కూడా మీరు థియేటర్ కి వెళ్లొచ్చు. మీరంతా సినిమాలు చూస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది .. మేము బాగుంటాము. ఒక వైపున ఫ్యామిలీని చూసుకుంటూ .. మరో వైపున దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటూ ఈ సినిమాను జీవిత మీ ముందుకు తీసుకుని వచ్చింది .. ఇదంతా ఆమె కష్టమే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో మా ఇద్దరమ్మాయిలు వాళ్ల అమ్మకి చాలా హెల్ప్ చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్లింది.
హీరోయిన్స్ ఇద్దరూ సూపర్ గా చేశారు. నాలాంటి ఓల్డ్ హీరోస్ తో చేయడానికి చాలామంది హీరోయిన్స్ ఒప్పుకోరు. వాళ్లిద్దరూ ఒప్పుకుని నేను కూడా సినిమాలో యంగ్ గా ఉండేలా చేశారు. అందుకు వాళ్లిద్దరికీ థ్యాంక్స్ చెబుతున్నాను.
ఈ సినిమాను మీరంతా పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నాను. తప్పకుండా మళ్లీ సక్సెస్ మీట్లో కలుసుకుందాం. ఈ ఫంక్షన్ కి వచ్చిన సుకుమార్ గారికీ .. సముద్రఖని గారికీ .. రాజ్ తరుణ్ గారికీ .. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.