మ‌న వాళ్ల డ‌బ్బింగ్ స్కిల్స్ సూప‌రెహే

Update: 2021-12-17 00:30 GMT
`బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమా వ‌చ్చేస్తోందంటే ప్ర‌పంచ సినిమా ఉలిక్కిప‌డి చూస్తోంది. కార‌ణం ఈ సారి ఎలాంటి అద్భుతాలు సృష్టించ‌బోతున్నారో.. ఏ స్థాయి సినిమాని అందించ‌బోతున్నారో అని ఆస‌క్తిగా టాలీవుడ్ వంక చూస్తున్నారు. గ‌తంలో పోలిస్తే మారిణ ప‌రిణామాలు, మార్కెట్ స్థాయిని దృష్టిలో పెట్టుకుని మ‌న స్టార్ లు కూడా కొత్త త‌ర‌హా చిత్రాల‌కే ప్ర‌ధాన్య‌త ఇస్తున్నారు. వ‌రల్డ్ స్టాయి ప్రేక్ష‌కుల్ని దృష్టిలో పెట్టుకుని లార్జ‌ర్ దెన్ లైఫ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికే ఇష్ట‌పడుతున్నారు.

అందుకు ఎలాంటి రిస్క్ లు చేయ‌డానికైనా వెనుకాడటం లేదు. ఇదే మ‌న వాళ్ల‌ని ప్ర‌పంచ సినీ య‌వ‌నిక‌పై కింగులుగా నిల‌బెడుతోంది. మారిన ప‌రిస్థితుల‌కు అనుగునంగా మ‌న చిత్రాలంటే ఇత‌ర భాష‌ల‌కు చెందిన ప్రేక్ష‌కుల‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ గా వున్న అన్ని భాష‌ల ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపిస్తుండ‌టంతో వారిని సంతృప్తి ప‌ర‌చ‌డం కోసం ఇత‌ర భాష‌ల‌కు సంబంధించిన వెర్ష‌న్ ల‌కు కూడా త‌మ పాత్ర‌ల‌కు తామే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు.

ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలిచిన చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ మూవీ ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఆ మ‌ధ్య మెగా ప‌వ‌ర్ స్టార్ పుట్టిన రోజు సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని రామ‌రాజు పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ `భీమ్ ఫ‌ర్ రామ‌రాజు` టీజ‌ర్ ని `ఆర్‌ ఆర్ ఆర్‌` రిలీజ్ చేసింది. ఈ ఇంట్రో టీజ‌ర్ కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చెప్పిన డ‌బ్బింగ్ రోమాంచిత అనుభూతిని క‌లిగించింది. ఇదే ఇంట్రో త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ వెర్ష‌న్ ల‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చెప్పిన డ‌బ్బింగ్‌.. ఆ బాష‌ల్లో ఆయ‌న మాడ్యులేష‌న్ చూసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలే పిచ్చెత్తిపోయాయి. ఓ రేంజ్‌లో ఎన్టీఆర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షాన్ని కురిపించాయి.

తాజాగా ఎన్టీఆర్ ఈ చిత్రానికి సంబంధించిన హిందీ వెర్ష‌న్ కి తానే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. అది ఇటీవ‌లే పూర్త‌యింది కూడా. ఎన్టీఆర్ త‌ర‌హాలో `రామ‌రాజు ఫ‌ర్ భీమ్` టీజ‌ర్ కోసం రామ్ చ‌ర‌ణ్ కూడా తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో మాత్ర‌మే డ‌బ్బింగ్ చెప్పాడు. ఎన్టీఆర్ త‌ర‌హాలో ఎఫెక్టీవ్ గా చెప్ప‌లేక‌పోయినా చ‌రణ్ త‌న వాయిస్ తో త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో మాత్రం శ‌భాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో నేచుర‌ల్ స్టార్ నాని కూడా `శ్యామ్ సింగ రాయ్‌` కి ప్ర‌య‌త్నిస్తున్నాడు. తెలుగుతో పాటు ఈ మూవీ ఐదు భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో త‌మిళ వెర్ష‌న్ కి నాని ఇటీవ‌లే డ‌బ్బింగ్ ని పూర్తి చేశార‌ట‌. ఈ చిత్ర త‌మిళ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు రిలీజ్ కాబోతోంది.

ఇంత‌కు ముందు త‌మిళ చిత్రాల్లో న‌టించిన నానికి త‌మిళ భాష‌పై ప‌ట్టువుండ‌టంతో త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకున్నార‌ని అటంఉన్నారు. అది ఎలా వుంటుంద‌న్నది తెలియాలంటే ఈ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే. మిగ‌తా భాష‌ల్లో మ‌న వాళ్ల డబ్బింగ్ స్కిల్స్ చూసిన వాళ్లంతా ఆ విష‌యంలో మన వాళ్లు కింగుల‌ని.. మ‌న వాళ్ల డ‌బ్బింగ్ స్కిల్స్ సూప‌రెహె అని కితాబిస్తున్నారు. ఇదిలా వుంటే పాన్ ఇండియా రేసులో `పుష్ప‌`తో వ‌స్తున్న బ‌న్నీ మాత్రం ఈ హీరోల త‌ర‌హాలో డ‌బ్బింగ్ చెప్ప‌డానికి మాత్రం ఆస‌క్తిని చూపించ‌లేక‌పోయాడు. త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లోనూ బ‌న్నీ పాత్ర‌కు వేరే న‌టుడితో డ‌బ్బింగ్ చెప్పించ‌డం గ‌మ‌నార్హం.  `పుష్ప‌` హిందీ వెర్ష‌న్ కు బ‌న్నీ పాత్ర‌కు బాలీవుడ్ న‌టుడు  శ్రేయాస్ త‌ల్పాడే డ‌బ్బింగ్ చెప్పాడు.
Tags:    

Similar News