భామల మధ్య కోల్డ్ వార్ రెగ్యులర్ గా వినేదే. ఒకరి ఛాన్స్ ఇంకొకరికి టర్న్ అవ్వడం అనేది బ్యూటీస్ మధ్య వార్ కు తావిస్తుంటుంది. కానీ ఇప్పటి సన్నివేశం వేరుగా ఉంది. అందగత్తెలు అవకాశాల కోసం పోటీపడడం అన్నది లేదు ఇప్పుడు. ఇటీవలే నివేద థామస్ అన్నట్టు... పరిశ్రమలో ఎవరి స్కోప్ వాళ్లకు ఉంటుంది. నా పరిధిలో నేను నటించేస్తుంటాను. నా అవకాశాలు నాకు ఉంటాయి.. అని సరిపెట్టేసుకుంటున్నారు మన భామలు. ఇటీవల నాయికల ఆలోచనా శైలి లో మార్పు, పరిణతి స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదివరకూ భామల మధ్య క్యాట్ ఫైట్ అవకాశాల కోసం ఉండేది.. కానీ ఇటీవల అలా లేదు. పోటీ రకరకాలుగా షిఫ్టయ్యింది. నేటితరం నిరంతరం అభిమానులకు టచ్ లో ఉండాలనుకుంటున్నారు. ఆ విషయంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. సోషల్ మీడియాని హీటెక్కిస్తూ సరికొత్త పోటీ కి తెరతీసారు. ఒకరిని మించి ఒకరు హాట్ ఫోటో షూట్లతో చెలరేగుతూ నిరంతరం అభిమానుల చర్చల్లో నిలవాలని ఉబలాట పడుతున్నారు. సోషల్ క్వీన్స్ గా వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్నారు. మ్యాగజైన్ కవర్ ఫోటోలతో పాటు, వ్యక్తిగత జీవితాల్లో చాలా సంగతుల్ని, ఫ్యామిలీ వేడుకల్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు చేరవేస్తూ నిరంతరం వేడెక్కిస్తున్నారు.
ఈ విషయంలో పోటీ ఎంతగా ఉంది? అంటే.. ఎంతో డీసెంట్ గా కనిపించే చందమామ కాజల్ - అక్కినేని కోడలు సమంత ఇటీవల రూల్స్ ని బ్రేక్ చేసేస్తున్నారు. పోటాపోటీగా ఫోటో షూట్లు సోషల్ మీడియాలోకి వచ్చి పడుతున్నాయి. ఇన్ స్టాలో ఆ ఇద్దరూ జరంత స్పీడ్ గానే ఉన్నారు. రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోషూట్లతో వైరల్ అయిపోతున్నారు. ఇటీవల ఫోటోషూట్లలో వేడెక్కించే కంటెంట్ పెరిగిందని యువతరంలో చర్చ సాగుతోంది. నవతరంలో రకుల్, ప్రగ్య జైశ్వాల్, రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరన్ వంటి భామలు ఎప్పటికప్పుడు ఫోటోషూట్లను అప్ లోడ్ చేస్తున్నారు. ఇతరులతో పోలిస్తే అనుపమ కాస్తంత డీసెంట్. టీనేజీ భామలు నభా నటేష్, నిధి అగర్వాల్ మధ్య ఒకటే పోటీ నెలకొంది. ఈ భామల అందాల ఆరబోతకు అడ్డూ ఆపూ అన్నదే లేదు. సోషల్ రేస్ కి అనుష్క, కీర్తి సురేష్ వంటి భామలు దూరంగానే ఉన్నారు. వీళ్లు పద్ధతైన వస్త్రధారణలో మాత్రమే కనిపించేందుకు ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ అట్మాస్పియర్ ఇప్పుడు సౌత్ లోనూ కనిపిస్తోందనడానికి ఈ `సోషల్` కాంపిటీషన్ ఆజ్యం పోస్తోంది. ఇక సోషల్ రేస్ లో నవతరం ట్యాలెంటు ఎందరో తమని తాము ప్రమోట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుండడం కొత్త ట్రెండ్.