ఎంత పెద్ద హీరోయిన్ అయినా స్టార్ డమ్ అనేది కొన్నేళ్ళు మాత్రమే. ఎందుకంటే మేల్ స్టార్స్ ఆధిపత్యం చెలాయించే చిత్ర పరిశ్రమలో.. హీరోయిన్స్ కెరీర్ తక్కువ కాలమే ఉంటుంది. అందం అభినయం కలబోసినా కథానాయికగా కొనసాగేది కొంతకాలమే. హీరోలు ఎలా ఉన్నా పట్టించుకోరు కానీ.. హీరోయిన్ల విషయంలో ప్రతీది పరిగణనలోకి తీసుకోబడుతుంది.
అందుకే ప్రతీ హీరోయిన్ క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని ఆలోచిస్తుంది.. డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంది. అయితే ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న తర్వాత కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీనుంచి వెళ్ళిపోతే.. మరికొందరు మాత్రం సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయి పరిశ్రమలో కొనసాగుతుంటారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణించిన వారిలో చాలామంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్క - వదిన - అమ్మ - అత్త.. ఇలాంటి పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. గతంలో తెలుగులో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్.. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో అదరగొడుతున్నారు.
అప్పట్లో చిరంజీవి - నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ వంటి స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ గా రాణించిన సిమ్రాన్.. ఇప్పుడు ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ చేస్తూ వస్తోంది. స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకూ అందరి సరసన హీరోయిన్ గా జత కట్టిన ప్రియమణి.. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస అవకాశాలు అందుకుంది.
'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో ఫామ్ లోకి వచ్చిన ప్రియమణి.. 'నారప్ప' సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కు జోడీగా ముగ్గురు పిల్లల తల్లిగా నటించి ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రత్యేక పాత్ర పోషించిన 'విరాటపర్వం' మరియు 'మైదాన్' వంటి సినిమాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఈ క్రమంలో బాలయ్య - అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే సినిమాలో నటించనుందని టాక్ వినిపిస్తోంది.
'ఖుషి' 'ఒక్కడు' 'సింహాద్రి' లాంటి సినిమాలతో కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన భూమిక చావ్లా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ క్యారక్టర్స్ తో మెప్పిస్తోంది. ఇప్పటికే 'ఎంసీఏ' 'రూలర్' 'సీటీమార్' 'ఇదే మా కథ' 'పాగల్' వంటి పలు చిత్రాలలో వదిన - సిస్టర్ - మదర్ రోల్స్ చేసింది. ప్రస్తుతం భూమిక చేతిలో అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
సీనియర్ హీరోయిన్ స్నేహ కూడా ఇప్పటికే క్యారక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది. 'సన్నాఫ్ సత్యమూర్తి' 'వినయ విధేయ రామ' వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. హా హా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జెనీలియా.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైంది. అయితే ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు హీరోగా లాంచ్ అయ్యే సినిమాతో జెనీలియా తిరిగి ఇండస్ట్రీలో ఆడుగుపెడుతోంది.
'బద్రి' 'జానీ' సినిమాల్లో నటించిన రేణు దేశాయ్.. ఆ తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ తో విడిపోయిన ఇన్నాళ్లకు ఇప్పుడు తిరిగి మేకప్ వేసుకుంటోంది. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో రేణూ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు ఆధ్య అనే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ సంగీత 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో రష్మిక తల్లిగా కనిపించింది. 'ఆచార్య' లో స్పెషల్ సాంగ్ లో నర్తించింది.
'భద్ర' 'గుడుంబా శంకర్' వంటి సినిమాలతో అలరించిన మీరా జాస్మిన్.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు స్పెషల్ రోల్స్ తో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తోంది. 40 ఏళ్ల వయసులో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. ఇప్పటికే మలయాళంలో రెండు సినిమాలు చేసిన మీరా.. తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.
'జయం' 'దొంగ దొంగది' 'అపరిచితుడు' 'ఔనన్నా కాదన్నా' లాంటి పలు సినిమాలతో తెలుగులో మెప్పించిన సదా.. ఇప్పుడు మంచి పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోంది. ఇలా ఒకప్పుడు హీరోయిన్ లుగా మెప్పించిన వారంతా కొంచెం గ్యాప్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ ని గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక సూపర్ సీనియర్ హీరోయిన్లలో రమ్యకృష్ణ - మీనా - అమల - ఆమని - ఇంద్రజ - రాశి వంటి వారు యువ హీరోహీరోయిన్లకు తల్లి పాత్రల్లో కనిపిస్తున్నారు. రమ్యకృష్ణ - మీనా అయితే నాగార్జున - వెంకటేష్ వంటి సీనియర్ హీరోలకు జోడీగానూ చేస్తున్నారు.