కరోనా క్రైసిస్ కష్ట కాలంలో ప్రజల్లో హీరోగా అవతరించాడు సోనూసూద్. నటుడిగా ఓ వెలుగు వెలుగుతున్న క్రమంలోనే అతడు రాజకీయంగా ఇమేజ్ పెంచుకునేందుకు చాలా చేశాడన్న చర్చా సాగింది. అయితే అంతిమంగా సోనూసూద్ మానవత్వానికి జేజేలు పలికారు ప్రజలు. ఆపత్కాలంలో ఆదుకున్న సోనూసూద్ ని ప్రజలు అసలు మర్చిపోలేదు.
ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే సోనూ సూద్ బాలీవుడ్ టాలీవుడ్ లో బిజీ స్టార్. మల్టీ ట్యాలెంటెడ్ స్టార్ గా అతడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ ల ఆచార్య చిత్రంలో సోనూ విలన్ గా నటించాడు. తదుపరి త్రివిక్రమ్ - పూరి- కొరటాల వంటి వారితో సోనూసూద్ ప్రాజెక్టులు ఉన్నాయి.2001 విడుదలైన షహీద్-ఇ-ఆజంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సోనూ సూద్ వేగంగా తన నటనా నైపుణ్యంతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అతడు నటనలోకి వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనాన్ని అందించేలా చూసుకున్నాడు. నిజానికి సోనూ బాలీవుడ్ టాలీవుడ్ లో తన ప్రతిభతోనే బడా స్టార్లకు ఆప్తుడయ్యాడంటే అర్థం చేసుకోవాలి.
అక్షయ్ కుమార్- సల్మాన్ ఖాన్- షాహిద్ కపూర్ లాంటి అగ్రహీరోలతో పని చేసాడు. సల్మాన్ దబాంగ్ లో ఛేది సింగ్ గా అతని నటన ప్రేక్షకులపై ఒక ముద్ర వేసింది. తాజా ఇంటర్వ్యూలో సోను దబాంగ్ ఫ్రాంచైజీకి తిరిగి వస్తున్నారా? అని ప్రశనించగా... నేను దబాంగ్ ఫ్రాంచైజీకి తిరిగి రాగలనా లేదా అనేది నాకు తెలియదు అని చెప్పిన సోనూసూద్ సల్మాన్ భాయ్ అవకాశం ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేసాడు. అతను సల్మాన్ కు శుభాకాంక్షలు పంపాడు.. భాయ్ ని గొప్ప వ్యక్తి అని ప్రశంసించాడు.
సింగ్ ఈజ్ కింగ్ 2లో అక్షయ్ కుమార్ తో కలిసి పనిచేయడం గురించి సోనూను ప్రశ్నించగా.. "నాకు తెలియదు. దర్శకుడు అనీస్ బాజ్మీ నా పేరు చెప్పడం అతడిలోని మంచి వ్యక్తిత్వం అని నేను భావిస్తున్నాను" అని అన్నారు. 2008లో విడుదలైన సింగ్ ఈజ్ కింగ్ నిర్మాతలు ఈ యాక్షన్ కామెడీ సీక్వెల్ గురించి ఇంకా ప్రకటన చేయలేదు. ఒకవేళ సీక్వెల్ తెరకెక్కిస్తే అనీస్ బజ్మీ సోనూని ఎంపిక చేస్తారు.
అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ 'పృథ్వీరాజ్' గురించి మాట్లాడుతూ 'సింగ్ ఈజ్ కింగ్' లాంటి ఎంటర్ టైన్ మెంట్ తర్వాత అక్షయ్ తో సోను మూడవసారి కలిసి పని చేస్తున్నాడు. ఈ పీరియాడికల్ డ్రామాలో కీలక పాత్రను పోషించాడు. డా. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 3న విడుదలవుతోంది.
ఇందులో చాంద్ బర్దాయి అనే పాత్రలో సోను కనిపించనున్నారు. ఈ సినిమాలో సోనూ.. అక్షయ్ తో పాటు సంజయ్ దత్ - మానవ్ విజ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంతో అందాల భామ మానుషి చిల్లర్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది.